ఎన్నికల షెడ్యూలు విడుదలైన ఆరు గంటల్లో ఖమ్మం జిల్లాలో 12 లక్షల 50వేల రూపాయలని పోలీసులు పట్టుకున్నారు. వైరా సబ్ డివిజన్ పరిధిలోని మూడు చోట్ల నగదుని పట్టుకోవడం జరిగింది. అటు షెడ్యూల్ విడుదలవుతున్న క్షణంలోని వైరా సమీపంలో ఐదు లక్షల రూపాయల నగదుని తీసుకుని వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా కొనిజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు మరో రెండున్నర లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Minister KTR : దేశంలో రెండున్నర శాతం ఉన్న తెలంగాణ 30 శాతం అవార్డులు పొందుతోంది
ఇవే కాకుండా కొద్దిసేపటికి తల్లాడ వద్ద మరో ఐదు లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పరిమితి మించి అనుమతి లేకుండా తీసుకొని వెళుతుండగా ఈ డబ్బులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై అవుతుండగానే ఈ సమాచారం ప్రజలకి అందటం అనేది కూడా తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితులు పోలీసులు నగదును స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Also Read : Somireddy: అరాచక ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చారు..?