పదహారేళ్ల బాలుడిపై 27 ఏళ్ల వివాహిత కన్నేసింది. ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇంటి యజమాని కుమారుడిని వలలో వేసుకుంది. బాలుడితో సహా అతడు తెచ్చిన నగలతో చెన్నై కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేసింది. బాలుడి తల్లిదండ్రులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట పోలీసుల కథనం ప్రకారం.. రాధ అనే వివాహిత సిద్దిపేటలోని హనుమాన్ నగర్ లో ఓ అద్దె ఇంట్లో గత మూడేళ్ళుగా భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఇంటి యజమాని కొడుకుపై కన్నేసిన ఆమె..మాయమాటలతో లోబర్చుకుని శారీరకంగా వాడుకుంది. ఎక్కడికైనా వెళ్లిపోదామని బాలుడిని ఒప్పించింది. తన ఇంట్లో ఉన్న నగదు, నగలు తీసుకురావాలని బాలుడికి సూచించింది. వాటిని తీసుకొని ఈ ఏడాది జనవరి 22న భర్త, పిల్లల్ని వదిలేసి బాలుడితో చెన్నై వెళ్లిపోయింది ఈ కిలాడి.
READ MORE: TGSRTC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీజీఎస్ఆర్టీసీ..
బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. తాజాగా చెన్నైలో బాలుడితో వివాహిత ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇంతలో ఆ వివాహిత పోలీసులు పట్టుకుంటరాన్న అనుమానంతో బాలుడిని సిద్దిపేటలో ఇంటి వద్ద వదిలేసింది. బాలుడు తెచ్చిన నగలను చెన్నైలో అమ్మేసి జల్సా చేసినట్లు పోలీసులు తేల్చారు. మహిళను ఫోక్సో కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.