Darshan Gift Costly Range Rover Car To Pavithra Gowda: ప్రస్తుతం ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్‌ని అరెస్ట్ చేశారు. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడను కూడా అరెస్ట్ చేశారు. హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. పవిత్ర గౌడకు రేణుకా స్వామి అసభ్యకరమైన కామెంట్లు, సందేశాలు పంపినట్లు. దీంతో రేణుకాస్వామిపై దాడి చేసి హత్య చేశారు. ఇక దర్శన్ – పవిత్ర గౌడ గత 10 సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఈ విషయాన్ని పవిత్ర గౌడ స్వయంగా సోషల్ మీడియాలో రాసుకున్నారు కూడా. 10 ఏళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్న పవిత్ర గౌడకు దర్శన్ ఎన్నో ఖరీదైన బహుమతులు ఇచ్చాడు. అందులో లగ్జరీ కారు కూడా ఒకటి! పవిత్ర గౌడకు లగ్జరీ రేంజ్ రోవర్ కారు ఉంది.
Double ISMART: రేసులోకి డబుల్ ఇస్మార్ట్.. పుష్ప 2 డేటుకి దిగుతారట!
ఈ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ – KA04NE0777. నివేదికల ప్రకారం, కారు ఈ సంవత్సరం మార్చి చివరిలో ‘పవిత్ర గౌడ’ పేరుతో రిజిస్టర్ చేయబడింది. పవిత్ర గౌడకు దర్శన్ ఈ రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చాడు. పవిత్ర గౌడ తనకు ఈ కారు కావాలని దర్శన్‌కి పట్టుబట్టిందట. అందుకు కారణం దర్శన్ భార్య విజయలక్ష్మి! ఈ ఏడాది మార్చి ప్రారంభంలో దర్శన్ భార్య విజయలక్ష్మి రేంజ్ రోవర్ కారు కొనుక్కుంది. రేంజ్ రేవర్ కారును డెలివరీ తీసుకుంటున్న విజయలక్ష్మి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దర్శన్‌కి విజయలక్ష్మి ఈ రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.
దీంతో నకు కూడా అదే కారు కావాలని పవిత్ర గౌడ గౌడ్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో మార్చి నెలాఖరున పవిత్ర గౌడకు దర్శన్ వైట్ కలర్ రేంజ్ రోవర్ ఇచ్చాడని కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవిత్ర గౌడ పుట్టినరోజు 7, ఆమె బోటిక్ పేరు ‘రెడ్ కార్పెట్ స్టూడియో 777’. కాబట్టి పవిత్ర గౌడ తన కారుకు కూడా 0777 అనే ఫ్యాన్సీ నంబర్‌ని కొనుగోలు చేసింది. దర్శన్ బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో పవిత్ర గౌడకు దర్శన్ మూడు అంతస్తుల విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇచ్చాడు. ప్రస్తుతం పవిత్ర గౌడ & కుటుంబం అదే ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం.