MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Chirri Balaraju: ఏలూరు జిల్లాలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరోసారి వివాదంలో నిలిచారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేపై పూనెం వంశీ అనే వ్యక్తి దాడికి యత్నించాడని కార్యాలయ సిబ్బంది ఆరోపిస్తుండగా, మరోవైపు తనపై ఎమ్మెల్యే అనుచరులే దాడి చేశారని వంశీ వాదిస్తున్నారు. సమాచారం ప్రకారం, పూనెం వంశీ గతంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వద్ద పనిచేసిన వ్యక్తి. ఇటీవల ఎమ్మెల్యేకు సంబంధించిన అంశాలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ట్రోలింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో వంశీపై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఫిర్యాదుకు సంబంధించి వివరణ కోరేందుకు వంశీ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు, దూషణలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వంశీపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్లు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేకు అండగా నిలిచి సేవలు చేసిన తనను, తన తల్లిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సరికాదంటూ వంశీ ఎమ్మెల్యేను ప్రశ్నించినట్లు వీడియోల్లో వినిపిస్తోంది. మరోవైపు, ఎమ్మెల్యేపై దాడికి వంశీ ప్రయత్నించాడని కార్యాలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. పోలీసులు ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్‌పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్‌మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!