PM Narendra Modi: సీఎం చంద్రబాబు, మంత్రులకు మోడీ అభినందనలు.. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాం..
- ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను అంటూ ప్రధాని మోడీ ట్వీట్
- ముఖ్యమంత్రి అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు
- ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి టీడీపీ జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.. ముఖ్యమంత్రిగా నాల్గోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.. వారితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. సీఎం చంద్రబాబుతో.. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో.. సూపర్‌స్టార్ రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ సహా పలువురు నేతలతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇక, ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా సీఎం, కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
- Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ విషయానికి వస్తే.. ”ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఏపీని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి టీడీపీ, జనసేన మరియు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.” అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక, తన ట్వీట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రుల ప్రమాణస్వీకారానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేవారు ప్రధాని నరేంద్రమోడీ.
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యాను. ముఖ్యమంత్రి అయిన సందర్భంగా శ్రీ @ncbn గారికి, మరియు ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ కూడా అభినందనలు. ఎపిని నూతన కీర్తి శిఖరాలకు తీసుకెళ్లడానికి మరియు రాష్ట్ర యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి @JaiTDP,… pic.twitter.com/oVgnhlqw0u
— Narendra Modi (@narendramodi) June 12, 2024
తాజావార్తలు
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
-
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
-
BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
-
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
-
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..