PM Modi: నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Modi: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని.. నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు రాజంపేట పార్లమెంట్ పీలేరు నియోజక వర్గం కలికిరిలో ఎన్డీఏ భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, నారా లోకేష్, నాగబాబు, కిషోర్‌కుమార్‌ రెడ్డి సహా ఇతర నేతలు పాల్గొననున్నారు. సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Amit Shah: నేడు లఖింపూర్ ఖేరీ-కన్నౌజ్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం..

సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ రానున్నారు. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్‌ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియానికి మోడీ వెళతారు. స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్‌ షో ఉంటుంది. ఈ రోడ్‌ షోలో ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి పాల్గొననున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ పయనం అవుతారు.