PM Modi: నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని.. నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు రాజంపేట పార్లమెంట్ పీలేరు నియోజక వర్గం కలికిరిలో ఎన్డీఏ భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, నారా లోకేష్, నాగబాబు, కిషోర్‌కుమార్ రెడ్డి సహా ఇతర నేతలు పాల్గొననున్నారు. సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Amit Shah: నేడు లఖింపూర్ ఖేరీ-కన్నౌజ్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం..
Also Read
- Passport Fee: పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
- Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు. సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ రానున్నారు. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియానికి మోడీ వెళతారు. స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్ షో ఉంటుంది. ఈ రోడ్ షోలో ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి పాల్గొననున్నారు. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ పయనం అవుతారు.
తాజావార్తలు
-
Passport Fee: పాస్‌పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
-
Ketan Agarwal Case: సియా-చేతన్‌ను కలిపిన ‘దీపావళి’.. ఆరోజు ఏం జరిగిందంటే..!
-
Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!