కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అగ్నివీర్ స్కీం ఎంతటి వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. మూడేళ్ల విరామం అనంతరం ఆర్మీ చేపట్టిన అగ్నివీర్ పథకంలో భాగంగా తొలి బ్యాచ్ రెడీ అయింది. ఆర్మీలో ఉద్యోగాల నియామకం కోసం ప్రయోగాత్మకంగా చేపట్టిన పథకం అగ్నివీర్ లు. హైదరాబాద్ లోని ఆర్టిలరీ సెంటర్లో రిపోర్టు చేశారు తొలి బ్యాచ్ అగ్నివీర్లు. శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేసిన అగ్నివీర్లకు స్వాగతం పలికారు ఆర్మీ ఉన్నతాధికారులు. అగ్నివీర్ శిక్షణకు అవసరమైన సకల సదుపాయాలను కల్పిస్తున్నామంటున్నారు అధికారులు.
Read Also: Employees Layoffs : ఇక గోల్డ్ మాన్ వంతు.. 3200ఉద్యోగాలకు కోత
బిగ్రేడియర్ రాజీవ్ చౌహన్ మాట్లాడుతూ.. అగ్నివీరులకు శిక్షణ ఇవ్వడంలో బెస్ట్ క్యాంపస్ గోల్కొండ అన్నారు. 300 మంది సభ్యులు ఈ సెంటర్ కు వచ్చారన్నారు. వీరంతా దేశంలోని పలు రీజియన్లకు చెందినవారు. 3300 మంది అగ్నివీర్లు ఫిబ్రవరి చివరిలో సైన్యంలో చేరబోతున్నారని ఆయన చెప్పారు. మొత్తం 5500 మందికి గోల్కొండ ఆర్టిలరీ సెంటర్లో శిక్షణ ఇవ్వబోతున్నాం అని చెప్పారు. ఏడాది పాటు ఆర్టిలరీ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చామన్నారు. అత్యాధునిక పరికరాలు, శిక్షణకు కావాల్సిన సదుపాయాలు ఇక్కడ బాగున్నాయన్నారు. జనవరి ఒకటితో అగ్నివీర్ల శిక్షణ పూర్తయ్యిందరి చౌహాన్ వివరించారు.
Read Also: Varasudu: అఫీషియల్.. విజయ్ ‘వారసుడు’ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా