PM Modi Kashmir Visit: నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోడీ పర్యటన..
- నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూకాశ్మీర్ లో ప్రధాని మోడీ పర్యటన..
- పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని..
- అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Kashmir Visit: నేడు ( గురువారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ అండ్ కశ్మీర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో ‘ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్ఫార్మింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, జమ్మూ-కశ్మీర్లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు ఆయన చేయనున్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ఓపెనింగ్ చేస్తారని పీఎంఓ తెలిపింది. అలాగే, రేపు (జూన్ 21న) ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఇక, జమ్ము, కశ్మీర్ అభివృద్దితో పాటు తన పర్యటనకు సంబంధించిన అంశాలపై ప్రసంగిచే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సామూహిక యోగా సెషన్లో పాల్గొని యోగా యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేయనున్నారు.
Read Also: Kalki 2898 AD : ఆ మూడు ప్రపంచాల మధ్య యుద్ధమే కల్కి కథ : నాగ్ అశ్విన్
Also Read
- Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
- US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
కాగా, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2015 నుంచి ఢిల్లీలోని కర్తవ్య పథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, లక్నో, మైసూరు లాంటి మహానగరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా యువతకు సాధికారత కల్పించడంతో పాటు జమ్మూ కశ్మీర్ ను అభివృద్ది చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాశ్మీర్ పురోగతికి తోర్పడేలా అక్కడి యువతతో నేరుగా మోడీ సంభాషించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే 84 మేజర్ డెవలెవమెంట్ ప్రాజెక్ట్‌లను ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు.
Read Also: USA vs SA: అమెరికాపై అతి కష్టంగా గెలిచిన దక్షిణాఫ్రికా!
ఇక, 1,500 కోట్ల రూపాయలతో రోడ్డు, మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా పథకాలు, ఉన్నత విద్యకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, పారిశ్రామిక ఎస్టేట్ల అభివృద్ధి ఇలా అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టనున్నారు. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని 20 జిల్లాల్లోని 15 లక్షల మందికి ఉపాధి చేకూర్చేలా 1,800 కోట్ల రూపాయలతో బృహత్తరమైన మరికొన్ని కార్యక్రమాలను చేపట్టనున్నారు. అలాగే, ప్రభుత్వ సర్వీసులకు ఎంపికైన 2000 మందికి పైగా ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను అందించనున్నారు.
తాజావార్తలు
-
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
-
Mamata Banerjee: మమత పార్టీలో విభేదాలు.. నిరసనకు 35 మంది ఎమ్మెల్యేలే హాజరు..
-
Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
-
Lenovo Legion Y900: కొత్త టాబ్లెట్ లెనోవో లెజియన్ Y900 విడుదల..144Hz డిస్ప్లే, 12,700mAh బ్యాటరీ
-
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!