PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో నక్సలిజం, మావోయిజంపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా దేశ భద్రతకు, ప్రగతికి సవాలుగా మారిన నక్సల్స్ తుపాకీ సంస్కృతి ముగింపు దశకు చేరుకుందని స్పష్టం చేస్తూనే, సమాజంలో తిష్టవేసిన మరింత ప్రమాదకరమైన వర్గం గురించి దేశాన్ని హెచ్చరించారు. గతంలో అనేక సంవత్సరాల పాటు మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ అధికార వర్గాల్లో చోటు దక్కించుకున్నారని, చివరికి ప్రభుత్వ కమిటీల్లో సలహాదారులుగా చేరుతూ దేశ విధానాలనే ప్రభావితం చేశారని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. అడవుల్లో తుపాకులు చేతబట్టిన నక్సలైట్లను తుదముట్టించడంలో మన భద్రతా బలగాలు విజయం సాధించినప్పటికీ, అర్బన్ ప్రాంతాల్లో తిష్టవేసిన ‘అర్బన్ నక్సల్స్’ (దిమాగీ నక్సల్స్) ఇంకా కుట్రలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. హింస, అరాచకాల ద్వారా సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు వీరు సరికొత్త దారులు వెతుక్కుంటున్నారని, ఇలాంటి వారిని సమాజం గుర్తించి పూర్తిగా దూరం పెట్టాలని పిలుపునిచ్చారు.
యువతను ఈ విచ్ఛిన్నకర శక్తుల బారిన పడకుండా కాపాడుకుని, వారిని వికసిత్ భారత్ సాధించే దిశగా మళ్లించడం మనందరి బాధ్యత అని ప్రధాని నొక్కిచెప్పారు. సరిహద్దుల లోపలి నుంచి వచ్చే ముప్పు అయినా, విదేశీ సరిహద్దుల వెలుపల నుంచి ఎదురయ్యే సవాలైనా ఎదుర్కొనేందుకు భారత్ సదా సిద్ధంగా ఉందన్నారు. ఈ 21వ శతాబ్దంలో దశాబ్దాల నాటి పాత సవాళ్లకు స్వస్తి పలకడం అత్యంత ఆవశ్యకమని ప్రధాని వ్యాఖ్యానించారు. నక్సలిజం, మావోయిజం నాలుగు దశాబ్దాల పాటు అనేక లక్షల మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయని, ఎంతో మంది తల్లులకు కడుపుకోత మిగిల్చి తల్లిదండ్రుల కలలను కల్లలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాకీ నీడలో దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించిన ఈ హింసాత్మక సంస్కృతిని అణచివేసే క్రమంలో 3,500 మందికి పైగా భద్రతా బలగాలు ప్రాణాలు అర్పించారని, ఇది యుద్ధంలో జరిగే ప్రాణనష్టం కంటే తక్కువేమీ కాదని గుర్తుచేశారు. 2014లో దేశ ప్రజలు తమకు అధికారం ఇచ్చేనాటికే నక్సలిజం రహిత భారత్‌ను నిర్మించాలని గట్టి సంకల్పం తీసుకున్నామని మోడీ తెలిపారు. దశాబ్దాలుగా రక్తాన్ని చిందించిన ఆ నేలపై నేడు వికాసం, నమ్మకం, నూతనోత్సాహాలతో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగురుతోందని హర్షం వ్యక్తం చేశారు. నక్సల్స్ ఊపిరి త్రిప్పుకోలేని స్థితికి చేరుకున్నప్పటికీ, ఈ సవాలును ఏమాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని, సురక్షిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
Also Read
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
- PM Modi’s Saptdhara Vision: వికసిత్ భారత్ కోసం ‘సప్తధార’.. మోడీ చెప్పిన 7 కీలక శక్తులివే..
- Red Fort: ఎర్రకోట ఎందుకు అంత ముఖ్యమైంది? మొఘలుల నుంచి బ్రిటిష్ వరకు.. చరిత్రలోని ఆసక్తికర నిజాలు
- PM Modi: "మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు".. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
తాజావార్తలు
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్‌కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
-
Awarapan 2: ‘అవారపన్ 2’ బాక్సాఫీస్ దుమ్మురేపింది.. తొలి రోజే ‘బట్వారా1947’ను మూడింతలు దాటేసిన ఇమ్రాన్ హష్మీ
-
Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!