Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
- రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
- 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆమోదం
- తెలంగాణకు కూడా కీలక కనెక్టివిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways Approves 7 New Amrit Bharat Express Trains:రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా రైలు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు ఏడు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. సుదూర ప్రయాణికులకు తక్కువ ఛార్జీలతో మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ఈ రైళ్ల ప్రధాన లక్ష్యం. ఉత్తర, మధ్య, పశ్చిమ, దక్షిణ భారతదేశంలోని పలు ముఖ్య నగరాలను ఈ కొత్త రైళ్లు అనుసంధానించనున్నాయి. వీటిలో తెలంగాణ మీదుగా నడిచే రైళ్లు కూడా ఉన్నాయి.
1. ధన్‌బాద్- కోయంబత్తూరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నంబర్లు 22363/22364తో ప్రతిపాదించిన ఈ రైలు జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరును కలుపుతుంది.
Also Read
- LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
- Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
- TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
ప్రధాన స్టేషన్లు:
ధన్‌బాద్, గోమో, పరస్నాథ్, హజారీబాగ్ రోడ్, కోడెర్మా, గయా, అనుగ్రహ నారాయణ్ రోడ్, డెహ్రీ ఆన్ సోన్, ససారం, భభువా రోడ్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్, మిర్జాపూర్, ప్రయాగ్‌రాజ్ ఛెవ్కీ, కట్నీ, జబల్పూర్, నర్సింగ్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హార్షా.
తెలంగాణలో సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ మీదుగా ఈ రైలు ప్రయాణించే అవకాశం ఉంది. తర్వాత ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుత్తణి, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ మీదుగా కోయంబత్తూరు చేరుతుంది.
2. ప్రయాగ్‌రాజ్- లోకమాన్య తిలక్ టెర్మినస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
20436/20435 రైలు నంబర్లతో ప్రతిపాదించిన ఈ రైలు వారానికి ఒకసారి నడిచే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ను మహారాష్ట్రలోని ముంబైతో అనుసంధానిస్తుంది.
ప్రధాన స్టేషన్లు:
ప్రయాగ్‌రాజ్, సత్నా, జబల్పూర్, ఇటార్సీ, భుసావల్, కల్యాణ్ తదితర ముఖ్య స్టేషన్లలో ఆగేలా ప్రతిపాదించారు.
3. ప్రయాగ్‌రాజ్- ఉధ్నా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
20437/20438 రైలు నంబర్లతో ప్రతిపాదించిన ఈ వారపు సర్వీస్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను అనుసంధానిస్తుంది.
ప్రధాన స్టేషన్లు:
ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్, గోవింద్‌పురి, ఇటావా, టుండ్లా, ఆగ్రా ఇద్గాహ్, బయానా, హిండౌన్ సిటీ, గంగాపూర్ సిటీ, సవాయి మాధోపూర్, కోటా, రామ్‌గంజ్ మండి, భవానీ మండి, రత్లాం, వడోదర, ఉధ్నా.
4. సుబేదార్‌గంజ్- లోకమాన్య తిలక్ టెర్మినస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
14121/14122 రైలు నంబర్లతో ఈ రైలుకు కూడా రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఇది వారానికి ఒకసారి నడిచే సర్వీస్‌గా ప్రతిపాదించారు.
ప్రయాగ్‌రాజ్ ప్రాంతాన్ని ముంబైతో అనుసంధానించే ఈ రైలు సుబేదార్‌గంజ్, ఫతేపూర్, గోవింద్‌పురి, బాందా, చిత్రకూట్‌ధామ్ కర్వీ, సత్నా, మైహర్, కట్నీ, జబల్పూర్, ఇటార్సీ, ఖాండ్వా, భుసావల్, నాసిక్ రోడ్, కల్యాణ్, థానే మీదుగా లోకమాన్య తిలక్ టెర్మినస్ చేరుతుంది.
5. గోరఖ్‌పూర్- ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి రైలు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు 15095/15096 రైలు నంబర్లతో గోరఖ్‌పూర్- ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆమోదం లభించింది. ఈ రైలు వారానికి ఒకసారి నడిచే అవకాశం ఉంది.
ప్రధాన స్టేషన్లు:
గోరఖ్‌పూర్, ఖలీలాబాద్, బస్తీ, గోండా, బుర్హ్వాల్, సీతాపూర్, బరేలీ, మొరాదాబాద్, ఘాజియాబాద్, ఢిల్లీ.
6. గోరఖ్‌పూర్- బాంద్రా టెర్మినస్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
15085/15086 రైలు నంబర్లతో మరో వారపు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఆమోదం లభించింది. ఈ రైలు తూర్పు ఉత్తరప్రదేశ్‌ను ముంబైతో అనుసంధానించనుంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
ప్రధాన స్టేషన్లు:
గోరఖ్‌పూర్, ఖలీలాబాద్, బస్తీ, గోండా, బాద్షాహ్‌నగర్, ఐష్బాగ్, కాన్పూర్ సెంట్రల్, టుండ్లా, ఆగ్రా ఫోర్ట్, బయానా, గంగాపూర్ సిటీ, కోటా, భవానీ మండి, షామ్‌గఢ్, రత్లాం, వడోదర, సూరత్, వల్సాద్, వాపి, పాల్ఘర్, బోరివలి, బాంద్రా టెర్మినస్.
7. చర్లపల్లి- గోరఖ్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
తెలంగాణ ప్రయాణికులకు కూడా ఈ రైలు కీలకంగా మారనుంది. 22075/22076 రైలు నంబర్లతో ప్రతిపాదించిన చర్లపల్లి-గోరఖ్‌పూర్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను అనుసంధానిస్తుంది.
తెలంగాణలో ప్రధాన స్టేషన్లు
ఈ రైలు చర్లపల్లి, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల మీదుగా ప్రయాణించేలా ప్రతిపాదించారు. అనంతరం బల్హార్షా, చంద్రపూర్, నాగ్‌పూర్, బేతుల్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, ఓరై, కాన్పూర్ సెంట్రల్, ఐష్బాగ్, లక్నో సిటీ, గోమతీనగర్, బారాబంకి, గోండా మీదుగా గోరఖ్‌పూర్ చేరుతుంది.
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత ఏంటి?
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సుదూర ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరల్లో ప్రయాణం అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రతిపాదించిన ఏడు రైళ్లు అమల్లోకి వస్తే దేశంలోని పలు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉత్తర, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలకు ప్రయాణించే వారికి చర్లపల్లి-గోరఖ్‌పూర్, ధన్‌బాద్- కోయంబత్తూరు మార్గాలు ఉపయోగకరంగా మారనున్నాయి.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!