PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
- మోదీ ముంబై పర్యటనకు ముందు ఇద్దరు అనుమానితులు అరెస్ట్.
- నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ నుంచి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
- ఒకరి వద్ద నకిలీ PMO గుర్తింపు కార్డు లభించినట్లు వర్గాల వెల్లడి.
- మరో అనుమానితుడి వద్ద తుపాకీ ఉన్నట్లు సమాచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ నుంచి ఇద్దరు అనుమానితుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ప్రధాని నరేంద్రమోడీ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ సెంటర్లో గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026ను ప్రారంభించే కార్యక్రమానికి ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. మోడీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఇద్దరు అనుమానితులు పట్టుబడటం షాకింగ్‌కు గురిచేస్తోంది.
అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితుల్లో ఒకరు తాను ప్రధాని కార్యాలయం (PMO) అధికారిగా పరిచయం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పీఎంకు చెందిన నకిలీ ఐడీ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు. భద్రతా తనిఖీల్లో ఆ గుర్తింపు కార్డు నకిలీదని తేలింది. రెండో అనుమానితు వద్ద నుంచి తుపాకీ గుర్తించిన్నట్లు సమాచారం.
Also Read
- Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్‌పై కేసు!
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో జరుగుతున్న ప్రధాని మోడీ కార్యక్రమ వేదిక వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని, అతడి బాడీగార్డుగా నటిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తేలింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి 24 ఏళ్ల రోహన్ పరేఖ్ పేరుతో నకిలీ ఐడీ కార్డు కలిగి ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. తుపాకీ, నకిలీ ఐడీ కార్డు కలిగి వేదికలోకి ప్రవేశించడం వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకునేందుకు ముంబై పోలీసులు ప్రస్తుతం ఇద్దరు నిందితుల్ని విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్‌కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!