Parmliament Sessions: వాడీవేడిగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. మీడియాతో సంభాషించనున్న ప్రధాని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parmliament Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మీడియాతో సంభాషించే అవకాశం ఉందని లోక్‌సభ సెక్రటేరియట్ మంగళవారం తెలిపింది. పార్లమెంట్ సెషన్స్ బుధవారం ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. సభా కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు పార్లమెంట్ ఆవరణలో రక్షణ మంత్రి, లోక్‌సభ ఉపనేత రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. రెండు గంటల పాటు కొనసాగిన భేటీకి 30కిపైగా పార్టీల నేతలు విచ్చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలను పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు సూచించాయి. దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్ పేర్కొంది. రాజ్యసభ సెక్రటేరియట్ సభ్యుల కోసం ప్రవర్తనా నియమావళిని విడుదల చేసింది.
Exit Polls: ఆప్‌కు భారీ ఎదురుదెబ్బ.. అదే పెద్ద విషయమన్న కేజ్రీవాల్
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
ఇంటర్ సెషన్ వ్యవధిలో మరణించిన సభ్యులకు మొదటి రోజు లోక్‌సభ నివాళులర్పిస్తుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అక్టోబర్‌లో కన్నుమూసిన సమాజ్‌వాదీ పార్టీ పితామహుడు ములాయం సింగ్ యాదవ్, మరణించిన సభ్యులలో చిరస్మరణీయులు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఎగువ సభకు ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా రాజ్యసభలో కార్యకలాపాలను నిర్వహించే ప్రారంభ సెషన్ ఇది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 8 మధ్య జరిగాయి. శీతాకాల సమావేశాల కోసం కేంద్రం అజెండాలో 16 కొత్త బిల్లులున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దేశసరిహద్దుల భద్రత అంశంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!