PM Modi: జీఎస్టీ సంస్కరణలు 99% వస్తువులను 5% జీఎస్టీ పరిధిలోకి తెచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాజాగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణ మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చివేసిందన్నారు. పేదలు ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతున్నారని.. జీఎస్టీ రేటు తగ్గడం వల్ల కలలు నెరవేరడం సులభం అవుతుందన్నారు. “2024లో గెలిచిన తరువాత జీఎస్టీకి ప్రాధాన్యం ఇచ్చాం. జీఎస్టీ సంస్కరణలపై అన్ని వర్గాలతో మాట్లాడాం. వన్ నేషన్- వన్ టాక్స్ కలను సాకారం చేశాం. అన్ని రంగాల్లో సంస్కరణలు కొనసాగుతూనే ఉంటాయి. కొత్త జీఎస్టీతో నిత్యావసర వస్తువులన్ని మరింత చౌకగా మారతాయి. జీఎస్టీ సంస్కరణలు దేశాన్ని మరింత బలంగా మారుస్తుంది. కొన్నింటిపై పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చాం.” ప్రధాని మోడీ
READ MORE: PM Modi: ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
నాగరికత దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. చిన్న పరిశ్రమలే భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దిక్సూచిగా మారాయన్నారు. అంతా స్వదేశీ వస్తువులనే ప్రోత్సాహించాలని.. మన దేశంలో తయారయ్యే వస్తువులనే కొనాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువులను కొన్నామని గర్వంగా చెప్పండన్నారు. దేశ స్వాతంత్య్రానికి స్వదేశీ మంత్రం శక్తినిచ్చినట్లే, నేడు స్వదేశీ దేశ శ్రేయస్సుకు కూడా శక్తినిస్తుందని అన్నారు. నేడు, అనేక విదేశీ వస్తువులు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయని.. మన జేబుల్లోని దువ్వెన విదేశీయులదా? లేక భారతీయులదా? అని విషయం కూడా మనకు తెలియదన్నారు. వీటి నుంచి విముక్తి పొంది, మన యువత కృషిని, మేడ్ ఇన్ ఇండియా వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటినీ, ప్రతి దుకాణాన్నీ స్వదేశీ చిహ్నంగా మార్చాలని మోడీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. నేను స్వదేశీని కొంటాను. నేను స్వదేశీ వస్తువులను అమ్ముతాను. అని గర్వంగా చెప్పండన్నారు. ఈ నినాదం ప్రతి భారతీయుడి నైతికతగా మారాలన్నారు. ఇది జరిగినప్పుడే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
READ MORE: 10,100mAh బ్యాటరీ, 12 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరాలతో Huawei MatePad 12 X లాంచ్!