PM Modi: ఇది సామాన్యులకు తీపికబురు.. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త జీఎస్టీ రేట్లు రేపు, సెప్టెంబర్ 22న అమలులోకి వస్తాయి. దానికి ముందు.. మోడీ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రి మొదటి రోజు అని, ఆ రోజున నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమలు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది కేవలం వేడుకలకు సమయం మాత్రమే కాదని, ఆర్థికాభివృద్ధికి, పన్ను సంస్కరణలకు కీలకమైన దశ అని ప్రధాని అన్నారు. రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయని.. ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ఎంతో ఆదాయం మిగులుతోందని తెలిపారు. పండగల సమయంలో దేశంలోని అందరికీ మేలు జరుగుతుందని.. జీఎస్టీ సంస్కరణలతో భారత వృద్ధి రేటు మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో దేశంలోని ప్రతి పౌరుడి డబ్బు ఆదా అవుతుందన్నారు. ఇది సామాన్యులకు తీపికబురు అన్నారు.
READ MORE: 10,100mAh బ్యాటరీ, 12 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరాలతో Huawei MatePad 12 X లాంచ్!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
“2017లో జీఎస్టీతో కొత్త అధ్యాయం మొదలైంది. అంతకు ముందు ఎన్నో రకాల పన్నులు ఉండేవి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలన్న పన్నులు కట్టాల్సి ఉండేది. జీఎస్టీ సంస్కరణలు ఎఫ్‌డీఐలను మరింత ప్రోత్సహిస్తాయి. గతంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి వస్తువులు అమ్ముకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. గతంలో టాక్స్, టోల్‌తో కంపెనీలన్ని ఇబ్బందులు పడ్డాయి. ఆ భారమంతా వినియోగదారులపై పడేది. మీరు ఇళ్లు కట్టుకోవాలన్న, బండి, ఎలక్ట్రిక్ వస్తువులు కొనాలన్నా..మీకు భారీగా ఆదా అవుతుంది.” అని ప్రధాని మోడీ అన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!