AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Calls CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో వరుస తుఫాన్ల ప్రభావంతో సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని అర్నబ్, మురసు తుఫాన్లు ప్రభావితం చేసిన నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, జరిగిన నష్టంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల ప్రభావం, సహాయక చర్యలపై పీఎం, సీఎంల మధ్య చర్చ జరిగింది. తుఫాన్ల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయని సీఎం చంద్రబాబు ప్రధాని మోడీకి వివరించారు. ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, పంటలకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. అంతేకాకుండా రహదారులు, విద్యుత్ సరఫరా వ్యవస్థతో పాటు వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని సీఎం వివరించారు.
అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కోరారు. నష్టాన్ని అంచనా వేసి బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. మరోవైపు తుఫాన్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ప్రధాని మోడీ ప్రశంసించారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. తుఫాన్ల కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమించారని చంద్రబాబును అభినందించారు. విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మోడీ ప్రశంసించారు. వరుస తుఫాన్లతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతుందనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పంట నష్టంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు కేంద్ర సాయం కీలకం కానుంది.
Also Read
- Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
- Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
- CM Chandrababu: అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలే టార్గెట్.. సీట్లు రానివారికి తప్పకుండా న్యాయం చేస్తాం!
- AP Elections 2026: ఎస్ఈసీ కీలక సమీక్ష.. ఆ మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా!
తాజావార్తలు
-
AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!
-
Varanasi: రాజమౌళి గ్లోబల్ బ్రాండ్ + మహేష్ స్టామినా.. ‘వారణాసి’తో ఓవర్సీస్ బాక్సాఫీస్ లెక్కలు మారబోతున్నాయా.?
-
US Midterm Elections 2026: మిచిగాన్ నుంచి తొలి ముస్లిం సెనేటర్‌గా చరిత్ర సృష్టించిన డెమోక్రాట్.. అబ్దుల్ ఎల్-సయీద్ ఎవరు?
-
Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
-
CM Chandrababu: అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలే టార్గెట్.. సీట్లు రానివారికి తప్పకుండా న్యాయం చేస్తాం!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!