Home
Murasu Cyclone
Murasu Cyclone News
-
AP Cyclones Damage: సీఎం చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్.. ఏపీపై రెండు తుఫాన్ల ప్రభావంపై ఆరా!
PM Modi Calls CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో వరుస తుఫాన్ల ప్రభావంతో సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వారం రోజుల వ్యవధిలోనే రాష్ట్రాన్ని అర్నబ్, మురసు తుఫాన్లు ప్రభావితం చేసిన నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, జరిగిన నష్టంపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ల ప్రభావం, సహాయక చర్యలపై పీఎం, సీఎంల మధ్య చర్చ జరిగింది. తుఫాన్ల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు,… -
Murasu Cyclone: మురసు తుఫాన్ బీభత్సం.. ఏపీలో పలు జిల్లాలు జలమయం!
‘మురసు’ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తిరువూరులో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా.. విస్సన్నపేట, ఏ.కొండూరు మండలాల్లో 10… -
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
Kharif Paddy Crop Damage in East Godavari: ‘అర్నబ్’ తుఫాన్ ప్రభావం నుంచి తూర్పుగోదావరి జిల్లా ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరోసారి వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. ‘మురసు’ తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇప్పటికే అర్నబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఖరీఫ్ వరి పంటకు తాజా వర్షాలు మరింత నష్టం కలిగిస్తున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న… -
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
Flights Cancelled at Rajahmundry Airport: మురసు తుఫాన్ ప్రభావం విమాన సర్వీసులపై పడింది. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి పలు విమానాల రాకపోకలు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లే నాలుగు విమాన సర్వీసులు, చెన్నైకి వెళ్లే ఒక విమాన సర్వీసును అధికారులు రద్దు చేశారు. ముందస్తుగానే ప్రయాణికులకు సమాచారం అందించారు. వరుసగా రెండో రోజు కూడా తుఫాన్ ప్రభావంతో విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. మురసు తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా… -
CM Chandrababu: మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. 45 వేల మందికి పైగా అధికారులతో టెలికాన్ఫరెన్స్
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చగా.. ఆ వెంటనే మురుసు తుఫాన్ ముసురుకుంది.. అయితే, మురసు తుఫాన్ ప్రభావం, భారీ వర్షాల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. 12 జిల్లాలకు చెందిన కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. 45 వేల మందికి పైగా అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. గత వారం రోజులుగా అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో నిరంతరాయంగా సేవలందిస్తున్న అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు. ముఖ్యంగా… -
CM Chandrababu: తుఫాన్‌ను ఎదుర్కోవడంలో దేశానికే ఏపీ ఆదర్శం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu: ఓ వైపు తుఫాన్లు వణికిస్తే.. మరోవైపు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో హీట్ పెంచాయి.. అయితే, ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకే తాను తొలి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు తుపాన్లను ఎదుర్కొన్నామని, మొదట అర్నబ్ తుపాను, ఆ వెంటనే మురసు తుపాను రావడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయని వెల్లడించారు.… -
Amaravati Flood: తుఫాన్ వేళ అమరావతికి వరద టెన్షన్..! క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఏడీసీ ప్రత్యేక నిఘా
Amaravati Flood: మురసు తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరద నివారణ చర్యలపై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) ప్రత్యేక దృష్టి సారించింది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాజధాని పరిధిలోని వాగుల్లో వరద నీటి ప్రవాహాన్ని ఏడీసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఏడీసీ సీఎండీ డి. లక్ష్మీపార్థసారథి స్వయంగా పలు ప్రాంతాలను సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు. కొండవీటివాగు, పాలవాగు, పేరమ్మవాగు, కొటేళ్లవాగుల్లో నీటి ప్రవాహం, వరద… -
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుఫాన్.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు!
Heavy Rains in AP Due To Cyclone Murasu: తీవ్ర తుఫాన్‌గా మారిన ‘మురసు’ తీరం దాటింది. ఒంగోలు సమీపంలో నెల్లూరు-నరసాపురం మధ్య మురసు తుఫాన్ తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరం దాటినప్పటికీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మురసు… -
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ అప్రమత్తమయ్యాయి. ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పల్నాడు, బాపట్ల, నెల్లూరుతో పాటు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు విద్యాశాఖ అధికారులు రేపు ముందస్తు సెలవు ప్రకటించారు. నెల్లూరు – నరసాపురం… -
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
కోస్తాంధ్ర తీరానికి అతి సమీపంలో ఉన్న మురసు తుఫాన్ ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) నుంచి అధికారులు, జిల్లాల కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు. తుఫాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. దక్షిణ కోస్తాంధ్రలోని దిగువ ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!