Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Movie Shows: సినిమా టికెట్ ధరలు, థియేటర్ షోల సమయాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానులకు ఊరటనిస్తూ ఉదయం 6 గంటల షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్, టికెట్ రేట్ల పెంపు ప్రతిపాదనను మాత్రం తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.
గతంలో తెలుగు రాష్ట్రాల తరహాలోనే తమిళనాడులోనూ తెల్లవారుజాము నుంచే ప్రత్యేక షోలు ప్రదర్శించేవారు. అయితే 2023లో ‘తునివు’, ‘వారిసు’ చిత్రాల విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ఎర్లీ మార్నింగ్ షోలను పూర్తిగా రద్దు చేసింది. తాజాగా విడుదల చేసిన కొత్త జీవో ప్రకారం, మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఉదయం 6 గంటల షోలకు అనుమతి లభించింది. కొత్త సినిమాలు విడుదలైన మొదటి వారం రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 2:30 గంటల వరకు ప్రదర్శనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది.
Also Read
- CM Chandrababu: అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలే టార్గెట్.. సీట్లు రానివారికి తప్పకుండా న్యాయం చేస్తాం!
- AP Elections 2026: ఎస్ఈసీ కీలక సమీక్ష.. ఆ మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా!
- ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
- ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..
థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం షోల సంఖ్యపై కూడా వెసులుబాటు కల్పించింది. సాధారణ రోజుల్లో కంటే భిన్నంగా వారాంతాలు (వీకెండ్స్), పండుగలు, ప్రభుత్వ సెలవు దినాల్లో రోజుకు గరిష్టంగా ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు థియేటర్లకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. షోల సమయాల్లో మార్పులు చేసినప్పటికీ, టికెట్ ధరల పెంపు విషయంలో మాత్రం ప్రభుత్వం కఠిన నిర్ణయమే తీసుకుంది. కొత్త చిత్రాల విడుదల వేళ టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతించాలని నిర్మాతలు పెట్టుకున్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. సామాన్య ప్రేక్షకులపై ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతోనే టికెట్ హైక్స్‌కు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేయడంతో ప్రజల నుంచి ఈ నిర్ణయానికి విశేష ఆదరణ లభిస్తోంది.
తాజా నిర్ణయం ప్రకారం నటుడు సూర్య నటించిన తాజా చిత్రం ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండా సాధారణ ధరలతోనే థియేటర్లలోకి రానుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఉదయం 6 గంటల షోతో విడుదల కానున్న చిత్రంగా ఇది నిలవబోతోంది. ఈ పరిణామంతో అటు అభిమానులు ఉదయాన్నే థియేటర్లలో సందడి చేసే అవకాశం లభిస్తుండగా.. ఇటు సాధారణ రేట్లతోనే సినిమా చూసే వెసులుబాటు కలగడంపై ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Movie Shows: సినిమా టికెట్ ధరలపై సర్కార్ కీలక నిర్ణయం..! ఎర్లీ మార్నింగ్ షోలకు ఓకే.. రేట్ల పెంపునకు నో..!
-
CM Chandrababu: అన్ని జెడ్పీ, ఎంపీపీ స్థానాలే టార్గెట్.. సీట్లు రానివారికి తప్పకుండా న్యాయం చేస్తాం!
-
IND vs NZ 1st ODI: కోహ్లీ, రోహిత్, గిల్‌కు అరుదైన గౌరవం!
-
Mijia Electric Toothbrush 2 Pro: షియోమీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లాంచ్.. కలర్ స్క్రీన్, ప్రెజర్ అలర్ట్ ప్రత్యేకతలు ఇవే!
-
AP Elections 2026: ఎస్ఈసీ కీలక సమీక్ష.. ఆ మూడు మండలాల్లో ఎన్నికలు వాయిదా!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!