హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
- హోండా తన తొలి స్వదేశీ తయారీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ
- ‘హోండా ఆల్ఫా’ గా నామకరణం..
- 2026 డిసెంబర్ 2న భారత్‌లో ప్రపంచవ్యాప్తంగా తొలిసారి ఆవిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda ALPHA Electric SUV: హోండా కార్స్ ఇండియా తన తొలి స్వదేశీ తయారీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి ‘హోండా ఆల్ఫా’ (Honda ALPHA) అనే పేరును అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 2, 2026న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో ప్రపంచవ్యాప్తంగా తొలిసారి ఆవిష్కరించనుంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ కారుతోనే భారత్‌లో హోండా కొత్త హెచ్ మార్క్ (H Mark) లోగోను కూడా పరిచయం చేయనుంది. అంతేకాకుండా ఈ మోడల్‌కు భారత్ గ్లోబల్ తయారీ కేంద్రంగా వ్యవహరించనుంది.
0 ఆల్ఫా కాన్సెప్ట్ ఆధారంగా తయారీ
2025 జపాన్ మొబిలిటీ షోలో హోండా తొలిసారిగా 0 ఆల్ఫా కాన్సెప్ట్ ప్రోటోటైప్‌ను ప్రదర్శించింది. దాని ఆధారంగానే ప్రస్తుతం ప్రొడక్షన్ వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. గ్రీకు వర్ణమాలలోని మొదటి అక్షరం ఆల్ఫా నుంచి ఈ పేరును తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త ప్రారంభానికి ప్రతీకగా ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కంటే ముందుగా ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత్‌లోనే అందుబాటులోకి రానుంది.
Also Read
- TVS Apache RTR 125 LC: EICMA 2026లో TVS Apache RTR 125 LC బైక్ ఆవిష్కరణ.. 125cc ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
- Hero Xpulse 450: హీరో Xpulse 450 ఆవిష్కరణ.. 421cc ఇంజిన్‌తో పాటు Android Auto, Apple CarPlay సపోర్ట్
- 440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
- 47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మరో ప్రత్యేకత కొత్త హెచ్ మార్క్ లోగో. హోండా కార్స్ ఇండియా తన అధికారిక కమ్యూనికేషన్లో ఈ కొత్త లోగోను తొలిసారిగా పరిచయం చేసింది. 1963లో తొలిసారి ప్రవేశపెట్టిన హోండా ఆటోమొబైల్ హెచ్ లోగోకు కాలానుగుణంగా పలు మార్పులు జరిగాయి. తాజాగా రూపొందించిన డిజైన్ కంపెనీ కొత్త ఆలోచనలు, సాంకేతిక పరివర్తనకు ప్రతీకగా నిలుస్తుందని హోండా వెల్లడించింది. భారత్‌లో ఈ కొత్త లోగోతో రాబోయే తొలి మోడల్‌గా ఆల్ఫా నిలవనుంది.
భారత రోడ్లపై
హోండా 2026 మార్చిలో రాజస్థాన్‌లోని తపుకరా తయారీ కేంద్రం నుంచి 0 ఆల్ఫా పరీక్షలను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా హైవేలు, నగర రహదారులు, గుంతలతో కూడిన మార్గాలు, విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఎస్‌యూవీని పరీక్షిస్తోంది. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపైనా ప్రత్యేకంగా పరిశీలనలు నిర్వహిస్తోంది. గతంలో పరీక్షల సమయంలో కనిపించిన ప్రోటోటైప్‌లో పెద్ద ల్యాండ్‌స్కేప్ టచ్‌స్క్రీన్, ప్రత్యేక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు గుర్తించారు. అయితే ప్రొడక్షన్ మోడల్లో వచ్చే ఫీచర్లు, పూర్తి ఇంటీరియర్ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
హోండా అమ్మకాలు
2026లో హోండా ఇప్పటికే పలు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. మే నెలలో సిటీ ఫేస్‌లిఫ్ట్, జూలైలో జెడ్ఆర్-వీ హైబ్రిడ్, అక్టోబర్‌లో ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు డిసెంబర్లో ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2026లో కంపెనీ దేశీయ విక్రయాలు 7,609 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 19 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్‌తో పోలిస్తే 70.41 శాతం పెరిగాయి. అయితే ఎగుమతులు 88.53 శాతం తగ్గి 473 యూనిట్లకు పరిమితమయ్యాయి. దీంతో మొత్తం అమ్మకాలు 8,082 యూనిట్లుగా నమోదయ్యాయి.
తాజావార్తలు
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Trump’s Midterm Setback: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో.. ట్రంప్ పార్టీ ఓడితే భారత్‌కు లాభమా? నష్టమా?
-
Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
-
King 100 Glimpse: ‘మహంతి ఝాన్సీ రాణి’ అనే నేను..
-
Murasu Cyclone: మురసు తుఫాన్ బీభత్సం.. ఏపీలో పలు జిల్లాలు జలమయం!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి