ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్, యూట్యూబర్ అబ్రదీప్ సాహా అలియాస్ యాంగ్రీ రాంట్‌మెన్ చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచారు. 27 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. మంగళవారం రాత్రి సాహా ఈ లోకాన్ని విడిచారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు.. సాహా మరణవార్తను సోషల్ మీడియాలో తెలియజేశారు. దీంతో ఆయన అభిమానులు, నెటిజన్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నెటిజన్లు పోస్టులు పెడుతూ సంతాపం తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Health Tips : ఎండాకాలంలో బెల్లంను ఎక్కువగా తింటున్నారా? ఇది మీ కోసమే..
గత కొంతకాలంగా సాహా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. త్వరలోనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధపడుతున్నాడు. ఇంతలోనే ఆయన మరణవార్త వార్త తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. అయితే సాహా అవయవాలు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ కారణంతోనే హఠాత్తుగా మృతిచెందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాహా.. సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ సంపాదించాడు. నిత్యం సమాజంలో ప్రతి రోజూ జరిగే అంశాలపై తనదైన శైలిలో విశ్లేషిస్తూ వీడియోలు చేస్తుంటాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబుల్లో పోస్టు చేయడంతో తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా మంచి క్రేజును సంపాదించుకున్నాడు.
ఇది కూడా చదవండి: MP K.Laxman : కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి దుస్థితి తప్పదు
కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబ్రదీప్ సాహా రాంట్ మ్యాన్ అనే సోషల్ డియా పేరుతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటిసారి కేజీఎఫ్ సినిమా రివ్యూతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అందరిలా కాకుండా చాలా అవేశంతో, కోపంగా ముఖాన్ని పెడుతూ ఫన్నీగా రివ్యూలు ఇచ్చేవాడు. సినిమానే కాకుండా క్రికెట్, ఫుట్‌బాల్, పాలిటిక్స్ ఇలా ప్రతి అంశంపై మొఖం మీద కొట్టినట్లు తన అభిప్రాయాలను పంచుకుంటూ నెట్టింట మంచి ప్రాచూర్యం పొందాడు. అలాంటిది అతని వార్త తెలియగానే నెటిజన్లు తీవ్ర షాక్‌కు గురయ్యారు. సాహా మరణంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. సెలబ్రిటీలు సైతం రిప్ అని పెడుతూ తమ సానుభూతిని తెలియజేస్తున్నారు. ట్వీట్లు, కామెంట్లతో నెంబర్-1 స్థానంలో యాంగ్రీ రాంట్ మ్యాన్ పేరు ట్రెండింగ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: IPL 2024: కేకేఆర్ మ్యాచ్లో చాహల్ చెత్త రికార్డు..!
ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరాడు. నెల రోజులకు పైగా అబ్రదీప్ సాహా చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ట్రీట్మెంట్‌కు స్పందిస్తున్నాడని త్వరలోనే బయటకు వస్తాడంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆయనకు కిడ్నీలు ఫెయిలవడంతో మల్టీ ఆర్గాన్స్ చెడిపోయి చాలా రోజులుగా ఐసీయూలోనే మృత్యువుతో పోరాడినట్లు అక్కడి వార్తా పత్రికలు తెలిపాయి. పూర్తిగా అవయవాలు పాడవ్వడంతోనే సాహా ప్రాణాలు కోల్పోవల్సి వచ్చిందని సమాచారం. సాహా యూట్యూబ్ ఛానెల్‌కు 4.81 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. చివరి వీడియో మార్చి 8న పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఎలాంటి వీడియోలు పోస్టు చేయలేదు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: New York: న్యూయార్క్లో కాల్పులు కలకలం.. నలుగురిని కాల్చిన దుండుగులు, ఒకరు మృతి
With a heavy heart I have to say Abhradeep Saha or Angry Rantman as you all know him, passed away last night.
Loss of words at the moment ……
The memories of joy which he was able to bring on everyone's faces will surely be missed now. pic.twitter.com/BoVb69O7Fb
— Raj4SSR (@raj4_ssr) April 17, 2024