పాతబస్తీలోని ప్రసిద్ధ సర్దార్ మహల్‌ను పునరుద్ధరించే ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చార్మినార్‌కు సమీపంలో ఉన్న 122 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ హెరిటేజ్ ప్యాలెస్ రాజస్థాన్‌లోని నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్ తరహాలో అభివృద్ధి చేయబడి, గ్యాలరీ, స్టూడియో, కేఫ్ మరియు హెరిటేజ్ వసతితో కూడిన సాంస్కృతిక కేంద్రాన్ని కలిగి ఉంటుంది. అయితే.. తెలంగాణ ప్రభుత్వం కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (QQSUDA), కళాకృతి ఆర్ట్ గ్యాలరీ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో ఈ పనులు చేపట్టనున్నారు. ఒకసారి సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చెందిన తర్వాత, సర్దార్ మహల్ మ్యాప్‌లు, పెయింటింగ్‌లు, చిత్రాలు ఇతర కళాకృతుల ద్వారా ఈ ప్రాంత చరిత్రను ప్రదర్శిస్తుంది. మునుపటి భవనం మాదిరిగానే కొత్త రూపురేఖలు ఉంటాయని, దాని అసలు వైభవాన్ని పునరుద్ధరించడం ద్వారా కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) శాఖ అధికారులు తెలిపారు.
Also Read : Astronauts: 6 నెలల స్పేస్ మిషన్ తర్వాత సురక్షితంగా తిరిగొచ్చిన చైనీస్ వ్యోమగాములు
సర్దార్ మహల్ పునరుద్ధరణ ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసినట్లు ఆదివారం MA&UD స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్విట్టర్‌లో ప్రకటించారు. వివరణాత్మక సైట్ సర్వే, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం తర్వాత పునరుద్ధరణ ప్రణాళిక ఖరారు చేయబడింది. కసరత్తులో భాగంగా మార్కెట్ అసెస్‌మెంట్ మరియు ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఫార్ములేషన్ కూడా జరిగింది. ఏళ్ల తరబడి ఆ భవనంలోనే జీహెచ్‌ఎంసీ సౌత్ జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన పౌరసరఫరాల అధికారులు సైతం సర్దార్ మహల్‌ను వినియోగించుకున్నారు. 1900లో నిజాం VI మీర్ మహబూబ్ అలీ ఖాన్ నిర్మించిన సర్దార్ మహల్‌ను హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ మరియు ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వారసత్వ భవనంగా ప్రకటించాయి.
Also Read : Chiranjeevi: నేవీ డే సందర్భంగా అభిమానులకు మెగాస్టార్ సూపర్ గిఫ్ట్
122 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్యాలెస్ హైదరాబాద్‌కు వచ్చే వారు సందర్శించాల్సిన ప్రదేశాల జాబితాలో ఒకప్పుడు ఉన్నత స్థానంలో నిలిచింది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో భవనంలోని కొన్ని భాగాలు నిర్మాణపరంగా బలహీనంగా మారాయి. ప్రస్తుత ప్రభుత్వం దీనిని కాపాడేందుకు సకాలంలో ముందస్తు చర్యలు చేపట్టి భవనానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇంతలో, సర్దార్ మహల్‌కు దాదాపు 2 కి.మీ దూరంలో ఉన్న ఖుర్షీద్ జా దేవ్‌డిని పునరుద్ధరించడానికి కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధమవుతోంది.