Site icon NTV Telugu

Piyush Goyal: 40 రైతుల ఏళ్ల కల నెరవేరింది.. ఈ ఘనత వాళ్లదే..

Piyush Goyal

Piyush Goyal

జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి వర్చువల్‌గా ప్రారంభించారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి. నిన్ననే కేంద్రం పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆయన మాట నిలబెట్టుకున్నారు.

READ MORE: Bandi Sanjay Kumar: పసుపు రైతుల జీవితాల్లో కొత్త కాంతులు రాబోతున్నయ్..

ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయష్ గోయల్ మాట్లాడారు. “మోడీ ఆశీర్వాదంతో పసుపు బోర్డు ఏర్పాటు చేశాం. చెప్పినదాన్ని చేసి చూపించడమే మోడీ ప్రభుత్వం విధానం. 40 రైతుల ఏళ్ల పసుపు బోర్డు కల నిజం చేశాం. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు పని చేస్తుంది. దీని వల్ల పసుపు రైతుల అభివృద్ధికి మరింత ఊత లభిస్తుంది. ఈరోజు నుంచే పసుపు బోర్డు పనిచేయడం ప్రారంభిస్తుంది. స్పైస్ బోర్డు నిధులను ప్రస్తుతం దీనికి ఉపయోగిస్తాం. వచ్చే బడ్జెట్లో పసుపు బోర్డుకు తగిన నిధులు కేటాయిస్తాం. పసుపు బోర్డుకు తగ్గిన అధికారులు సిబ్బందిని కేటాయిస్తాం. రెండేళ్లలో పసుపు ఉత్పత్తి రెండింతలు చేస్తాం. పెద్ద ఎత్తున ఎగుమతులను ప్రోత్సహిస్తాం. ఆయుర్వేద ఔషధాల తయారీలో పసుపు వినియోగంపై ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. ప్రస్తుతం ఉన్న భవనాలనే పసుపు బోర్డుకు ఉపయోగిస్తాం. అరవింద్, బండి సంజయ్ పోరాట ఫలితమే పసుపు బోర్డు. పసుపు రైతుల ఆదాయం పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు 20 రాష్ట్రాల్లో 30 రకాల పసుపు పండుతుంది. ప్రపంచంలోని 70 శాతం భారత్ లోనే పండుతుంది.” అని కేంద్ర మంత్రి వెల్లడించారు.

 

Exit mobile version