Piyush Goyal: ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ సమ్మిట్ లో పాల్గొన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. చంద్రబాబు నా పెద్దన్న.. సంస్కరణల ఆర్కిటెక్ట్ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. హస్తానికి గుడ్‌బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తన అవసరం లేకపోతే చెప్పాలని.. తన ముందు చాలా ఆఫర్లు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి వర్చువల్‌గా ప్రారంభించారు. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
పార వీసాల జారీని వేగవంతం చేయాలని భారతదేశం అమెరికాను అభ్యర్థించిందని, తద్వారా ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను కొనసాగించేందుకు ప్రయాణాలను చేపట్టవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి 10 సెంట్రల్ విద్యాసంస్థలు వచ్చాయని… ఏపీకి కేటాయింపులకు ప్రధాని నరేంద్ర మోడీ రెండో ఆలోచన చేయరు, ఉండదని తెలిపారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. కాకినాడలో జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ప్రారంభించిన ఆమె.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మెరైన్ ప్రొడక్ట్‌ను ఎగుమతి చేయడంలో ఏపీ ముందు ఉందని ప్రశంసించారు.. ట్రేడ్ కోర్స్ లు…
ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌తో పనిచేస్తున్నారు.. దీంతో, ప్రపంచవ్యాప్తంగా భారత్ దూసుకుపోతోందన్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్… కాకినాడలో జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌తో కలిసి ప్రారంభించారు పీయూష్ గోయల్.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, వంగా గీతా పాల్గొన్నారు.. ప్రస్తుతం జేఎన్టీయూలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు.. సౌత్ ఇండియాలో తొలి ఐఐఎఫ్టీ…
Union minister Piyush Goyal criticizes CM KCR: కేసీఆర్ రేపు జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించారు. నీతి ఆయోగ్ రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని.. ఎజెండా తయారీలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉండటం లేదని.. సహకార సమాఖ్య విధానంలో నీతి ఆయోగ్ వ్యవహరించడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రులు మాట్లాడటానికి కూడా సమయం ఇవ్వడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీని, నన్ను అవమానకరంగా తిట్టారని, పేదలకు బియ్యం అందకుండా అన్యాయం చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్ సీ ఐని ఆదేశించినట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. పేదలకు బియ్యం అందకుండా చేసిందని.. ఏప్రిల్, మే నెలల్లో బియ్యం ఇవ్వకుండా పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ కార్యాలయం ముందు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల వరి కొనుగోలు నిరసన కారక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటకు గిట్టు బాటు ధర లేకుండా వుండే కానీ 2014లో తెలంగాణ రాష్టం వచ్చాక ఈ రాష్టానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలు మాగాణి చేయడానికి గోదావరీ జలాలను ముఖ్యమంత్రి తెచ్చారని,…