ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమను వెంటాడుతున్న పైరసీ భూతం ఆట కట్టించారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా సినిమా థియేటర్లో కూర్చుని పైరసీ రికార్డ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఏడాది కాలంగా 40 సినిమాలు రికార్డ్ చేసినట్లు విచారణలో బయటపడింది. కొత్త సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమాకు సంబంధించిన హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇతర నటీనటులు చెప్పే మాట ఒకటే..
READ MORE: Off The Record: టీడీపీ అధిష్టానానికి దూరంగా కోట్ల.. ఎందుకు టచ్ మీ నాట్..?
ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ.. అని నెత్తీనోరు మొత్తుకుంటున్నా.. పైరసీ భూతం సినిమాలను వదలడం లేదు. ఎక్కడో ఒక దగ్గర కాదు.. ఎక్కడ పడితే అక్కడ పైరసీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఏటా దాదాపు 3 వేల కోట్ల రూపాయలు సినీ పరిశ్రమ నష్టపోతోందంటే.. పైరసీ ఏ రేంజ్లో సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోందో అర్ధం చేసుకోవచ్చు.. టాలీవుడ్లో తీసిన పెద్దపెద్ద సినిమాలకు పైరసీ భూతం.. అశనిపాతంలా మారింది. సినిమా విడుదల చేయడం ఆలస్యం.. కొన్ని గంటల్లోనే పైరసీ ద్వారా ఆన్లైన్లో సినిమా ప్రత్యక్షం అవుతోంది. ఇప్పటికే సినిమాలకు నెగెటివ్ టాక్, ట్రోల్స్‌తో ఇబ్బంది పడుతున్న నిర్మాతలకు ఇది మరింత నష్టం కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు సినీ పరిశ్రమతోపాటు పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ.. ఎవరు ఎక్కడి నుంచి పైరసీ చేస్తున్నారో తెలుసుకోలేకపోయారు. ఏళ్ల తరబడి ఇదే జరుగుతోంది..
READ MORE: Off The Record: కేంద్ర పార్టీ కోర్ట్లోకి రాజాసింగ్ వ్యవహారం
అసలు ఈ పైరసీ భూతం వెనుక ఎవరున్నారు? ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది? ఎక్కడి నుంచి సినిమాలను పైరసీ చేస్తున్నారు? ఎవరు సినిమాలను షూట్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు? ఇలాంటి విషయాల్లో ఏ ఒక్కటి కూడా పోలీసులు గానీ.. సినీ ఇండస్ట్రీలోని వారు కానీ ఛేదించలేకపోయారు. కానీ తాజాగా పైరసీ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ చూడండి… ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జాన కిరణ్ కుమార్. ఇతడు ఏడాది కాలంలో 40 సినిమాలు పైరసీ చేశాడు.ఈ పైరసీ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి చేయలేదు. హైదరాబాద్ నడిబొడ్డులోని ఓ మాల్లో ఉన్న థియేటర్ నుంచే కథ అంతా నడిపించాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప లాంటి చిత్రాన్ని సైతం పైరసీ చేశాడు కిరణ్ కుమార్. ఇతడి దెబ్బకు ఈ ఏడాది టాలీవుడ్‌కు రూ. 3700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది..
READ MORE: Cheating Trade: ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జాన కిరణ్ కుమార్.. 8 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు. తల్లితో కలిసి బోరబండలో నివాసం ఉంటున్నాడు. నిజానికి ఇతను ఒక ఏసీ టెక్నీషియన్. ఐతే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పైగా అనారోగ్య కారణాలతో డబ్బులు సరిపోని పరిస్థితి. దీంతో సోషల్ మీడియాలో కొత్త ఉద్యోగం కోసం వెతుకాడు. ఆ క్రమంలో అతనికి ఓ తమిళ్ వెబ్సైట్ కనిపించింది. పార్ట్ టైమ్ ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో ఆ వెబ్‌సైట్‌ను కాంటాక్ట్ చేశాడు. వారు తమకు వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తామని తెలిపారు. ఎలాంటి వీడియోలు కావాలని అడిగినప్పుడు.. సినిమాతో పాటు హైదరాబాద్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు..
READ MORE: Suryapet Horror: ఎటుపోతున్నాయి మానవ సంబంధాలు.. కన్న తండ్రినే దారికాచీ మరీ హత్య చేసిన కొడుకు..!
ఇక తమిళ వెబ్‌సైట్‌తో టై అప్ అయిన కిరణ్.. ముందుగా కొన్ని ప్రైవేటు వీడియోలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే తమిళ కంపెనీ నేరుగా సినిమా టికెట్లు బుక్ చేసి వీడియో ఎలా రికార్డ్ చేయాలో చెప్పింది. సినిమా ధియేటర్లోపై నుంచి మొదటి రోలో సీట్‌ని బుక్ చేసుకునేవాడు. సినిమా విడుదలైన మొదటి రోజే మొదటి షోకి వెళ్లేవాడు కిరణ్. పాప్‌కార్న్ లేదా ఏదైనా బ్యాగు.. లేదంటే జేబులో సెల్‌ఫోన్ పెట్టుకుని సినిమా మొత్తాన్ని HD క్వాలిటీలో రికార్డ్ చేసేవాడు. ఇందుకోసం స్టాండ్ బై అనే యాప్ ను కిరణ్ వాడినట్లు తెలుస్తోంది. అలా రికార్డు చేసిన వీడియో మొత్తాన్ని లింకు ద్వారా తమిళ కంపెనీలకు పంపించేవాడు.
ఇక తమిళ వెబ్సైట్ వాళ్లు.. సినిమాను HD క్వాలిటీతోపాటు ఆడియోను మిక్స్ చేసి అప్లోడ్ చేసేవారు. ఈ ప్రాసెస్ అంతా సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే జరిగిపోయేది. సో.. ఒక్కో సినిమా రికార్డ్ చేసినందుకు గానూ జాన కిరణ్ కుమార్‌కు తమిళ వెబ్ సైట్ నుంచి రూ. 30వేల నుంచి రూ. లక్ష వరకు డబ్బులు వచ్చేవి. అతనికి అమెరికా డాలర్స్, క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో పైరసీ ద్వారా కిరణ్ కుమార్ ఇప్పటి వరకు లక్షల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు చెబుతున్నారు..
READ MORE: Suryapet Horror: ఎటుపోతున్నాయి మానవ సంబంధాలు.. కన్న తండ్రినే దారికాచీ మరీ హత్య చేసిన కొడుకు..!
చివరకు కిరణ్ కుమార్ ను పట్టుకున్న పోలీసులు.. కటకటాల్లోకి నెట్టారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దానిలో దాదాపు 40 సినిమాలకు సంబంధించిన పైరసీ రికార్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నాలుగేళ్ల నుంచి కిరణ్ కుమార్ పైరసీ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.. పైరసీ వెనుక ఉన్న కిరణ్ కుమార్‌ను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అతను ఇచ్చే సమాచారం ఆధారంగా తమిళ వెబ్ సైట్ నిర్వాహకులను కూడా పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు..మొత్తంగా పైరసీ కేసును ఇన్నాళ్లకు పోలీసులు ఛేదించగలిగారు. త్వరలోనే పైరసీ భూతాన్ని అంతం చేస్తామని చెబుతున్నారు. పైరసీకి సంబంధించిన సమాచారం ఉంటే తమకు చెప్పాలని కోరుతున్నారు.