ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమను వెంటాడుతున్న పైరసీ భూతం ఆట కట్టించారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా సినిమా థియేటర్లో కూర్చుని పైరసీ రికార్డ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఏడాది కాలంగా 40 సినిమాలు రికార్డ్ చేసినట్లు విచారణలో బయటపడింది. కొత్త సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమాకు సంబంధించిన హీరో, దర్శకుడు, నిర్మాత.. ఇతర నటీనటులు చెప్పే మాట ఒకటే..
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి, వాటిని 1Ta******er, 1t****v, 5M****z వంటి వెబ్‌సైట్‌లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు రూ.3700 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. Also…