Phone Tapping: ఎల్లుండి రాత్రి హైదరాబాద్ కు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
- ఎల్లుండి రాత్రి హైదరాబాద్ కు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు
- 9న సిట్ ముందు విచారణకు హాజరు కానున్న ప్రభాకర్ రావు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నిందితుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ అయింది. శుక్రవారం అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఈ వారెంట్‌ను విడుదల చేసింది. పాస్‌పోర్ట్ రద్దు కావడంతో ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ కోసం దరఖాస్తు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది జారీ అయ్యింది. ఈ పరిణామాలతో ప్రభాకర్ రావు శనివారం భారత్‌కు బయలుదేరి, జూన్ 8 అర్థరాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. వెంటనే జూన్ 9 ఉదయం ఆయన సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన సూత్రధారి అనే ఆరోపణల నేపథ్యంలో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు.
అత్యధిక ట్రాఫిక్ రద్దీ కలిగిన టాప్ 10 నగరాలు ఇవే..!
Also Read
- Tilak Varma: స్టార్ బాయ్‌కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్‌గా ఛాన్స్.!
- CWG 2026 Medals: ఒక్క రోజులో 16 పతకాలు.. పాయింట్స్ పట్టికలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్.!
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
- Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
బీఆర్ఎస్ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, తమదే పార్టీకి చెందిన అసమ్మతి నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం చాలా రోజులు గోప్యంగా కొనసాగినప్పటికీ, 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసు వెలుగులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షలో ఈ విషయాన్ని ప్రస్తావించగా, వెంటనే సిట్ దర్యాప్తు ప్రారంభమైంది.
ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల విచారణలో ప్రభాకర్ రావు పేరు ప్రముఖంగా వచ్చిందని సమాచారం. అయితే అప్పటికే ఆయన అమెరికాలో ఉండటంతో, అతన్ని భారత్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి తనపై రాజకీయ కక్షతో కేసు పెట్టారని వాదించగా, కోర్టు ఆయన విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. పాస్‌పోర్ట్ రద్దు కావడంతో ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఆయన దేశానికి తిరిగి రానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీసా జారీ అయిన తర్వాత మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచించబడింది.
Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదం.. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Gulveer Singh History: గుల్వీర్ సింగ్ నయా చరిత్ర.. తొలి భారత అథ్లెట్‌గా!
-
Huawei MatePad 11.5 2026: హువావే మేట్‌ప్యాడ్ 11.5 భారత్‌లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్‌మ్యాట్ డిస్ప్లే
-
Tilak Varma: స్టార్ బాయ్‌కి ప్రమోషన్.. సౌత్ జోన్ కెప్టెన్‌గా ఛాన్స్.!
-
Trump: ట్రంప్ కీలక ప్రకటన.. ఇరాన్‌పై కొత్త దాడులకు బ్రేక్..
-
Ghattamaneni Aadiseshagirirao : పద్మాలయ స్టూడియోస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే భాద్యత జై కృష్ణపై ఉంది
ట్రెండింగ్
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!