Mobiles Ban In School: ఇంట్లో ఎంత మంది ఉంటే.. అంత మందికి స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి ఇంటి దగ్గర ఉండే గృహుల వరకు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటున్నాయి. ఫోన్ లేకపోతే ఏదో వెళితిగా భావించే వారు ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే స్కూల్‌కి వెళ్లే పిల్లలు తమ బ్యాగులో మొబైల్ తీసుకెళ్లి ఖాళీ సమయంలో చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ ను నిషేధిస్తూ ఢిల్లీ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఢిల్లీ స్కూళ్లల్లో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా మొబైల్ ఫోన్ల వాడకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
Read also: Bangladesh Captain: బంగ్లాదేశ్ కెప్టెన్గా.. మళ్లీ మాజీనే
మొబైల్ ఫోన్ల నిషేధంపై ఢిల్లీ సర్కార్ క నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. క్లాస్ రూమ్స్, లైబ్రరీలు, ప్లే గ్రౌండ్స్‌తోపాటు పాఠశాల పరిధిలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ గురువారం ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు కూడా మొబైల్ ఫోన్లు వాడరాదని ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు, విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని విద్యశాఖ సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో 17 ఏండ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ అరెస్టయిన నేపథ్యంలో స్కూల్ ఆవరణల్లో మొబైల్ ఫోన్లు వాడొద్దని ఆదేశాలివ్వాలని అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ, ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్‌లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాయి. ఆ విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ హిమాంశు గుప్తా తెలిపారు. స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసినందుకు ఢిల్లీ విద్యాశాఖ డైరెక్టరేట్‌కు అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ అధ్యక్షుడు భరత్ అరోరా ధన్యవాదాలు తెలిపారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులు మొబైల్ ఫోన్లను ఇవ్వరాదని.. ఒక వేళ విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకొచ్చినా.. సురక్షితంగా నిల్వ చేసేందుకు లాకర్లను ఏర్పాటు చేయాలని స్కూళ్ల యాజమాన్యాలకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.