మహిళలు, యువతుల పట్ల వేధింపులు ఆగడం లేదు. ఆఫీసుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. వెకిలి చేష్టలు, అసభ్య ప్రవర్తనలతో రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తను మనిషి అన్న సంగతి మరిచాడు. కూతురు వయసున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కనే కూర్చుని బాలికపై చేయి వేసి అసభ్యంగా తాకుతూ మృగంలా ప్రవర్తించాడు. ఈ తతంగాన్నంతా పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ గా మారింది.
Also Read:RDO vs DRO: విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారుల మధ్య కోల్డ్ వార్.. నెలవారీ సరకుల కోసం..!
బీహార్ లోని ఛప్రా దగ్గర ప్యాసింజర్ రైలు(55103)లో బాలిక తన తల్లితో కలిసి ప్రయాణిస్తోంది. అయితే వారు కూర్చొన్న సీట్లోనే 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి మైనర్ బాలిక పక్కన కూర్చున్నాడు. ఈ సమయంలోనే తనలోని కామాంధుడు బయటికి వచ్చాడు. ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగును అడ్డం పెట్టుకుని బాలిక ఒంటిపై చేయి వేశాడు. బాలిక తల్లి గమనించలేకపోయింది. ఇదే సమయంలో ఓ యువకుడు తన ఫోన్ లో బాలికపై జరుగుతున్న దారుణాన్ని వీడియో తీశాడు. ఇంతలోనే తేరుకున్న ఆ కామాంధుడు రికార్డింగ్ చేస్తున్న విషయాన్ని పసిగట్టాడు. వెంటనే బాలిక ఒంటిపై నుంచి చేయి తీసేశాడు. ఏమీ ఎరగనట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కానీ ఆ యువకుడు నిలదీయడంతో భయంతో వణికిపోయాడు.
Also Read:Sadar Festival: హైదరాబాద్ లో మొదలైన సదర్ సందడి.. ప్రత్యేక ఆకర్షణగా గుమాన్ కాళీ దున్నరాజు
సీటులోంచి లేచి డోర్ దగ్గరికి వెళ్లాడు. వీడియో తీసిన యువకుడిని వీడియో డిలిట్ చేయాలని బ్రతిమిలాడాడు. కానీ ఆ యువకుడు ససేమిరా అనడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఆ వీడియో నెట్టింటా వైరల్ గా మారడంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూతురు వయసున్న బాలికపట్ల నీచంగా ప్రవర్తించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు నీకు చేతులెలా వచ్చాయిరా అంటూ మండిపడుతున్నారు.
यहां वीडियो देखिए pic.twitter.com/P3Zze73ZvC
— Nitin Prajapati (@Prajapat204) October 19, 2025