జగన్ ప్రభుత్వంలో తక్కువ రేటుకే సినిమాలు చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని పేర్ని నాని గుర్తు చేశారు.. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్.. నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.. సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట.. ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడటం సరికాదన్నారు. సినిమా వాళ్లకు గొడవలు జరుగుతున్న సమయంలో జైళ్లో వేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సినిమా ఫీల్డ్ ను ఉద్ధరిస్తారని ఆ శాఖ తీసుకున్న మంత్రి థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారని చెప్పారు.. ఇవి దివాలకోరు రాజకీయాలు కావా? అని నిలదీశారు.
READ MORE: Nilave: ‘నిలవే’ నిజాయితీతో కూడిన మ్యూజికల్ లవ్ డ్రామా!
మీ చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరింపులు చేస్తారా? అని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ఫైర్ అయ్యారు. జైళ్లలో వస్తామని బెదిరిస్తున్నారని.. రాబోయే ఫ్లాప్ సినిమా కోసం ఇంతలా చేయాలా? అని మండిపడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయని.. సినిమా వాళ్ళను బెదిరించటానికి మీరు ఎవరు? అని ప్రశ్నించారు. అసలు వాళ్ళ సమస్య ఏంటో మీకు తెలుసా? అని అడిగారు.
READ MORE: Bellamkonda Sai Sreenivas: ఆ సర్ ప్రైజ్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు
వైసీపీకి అంతక్రియలు చేస్తామని వ్యాఖ్యానించిన సోమిరెడ్డిపై పేర్ని నాని ఫైర్ అయ్యారు.అంత్యక్రియలు చేయటం సోమిరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని.. రాజకీయంగా చేరదీసిన ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన ఘనులు వీళ్ళని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులు ఇవ్వలేదని ఎవరికి పడితే వాళ్లకు అంత్యక్రియలు చేయకండని సూచించారు. వాసంశెట్టి సుభాషే ఒక పిల్ల గాడిద అని తీవ్రంగా విమర్శించారు..
READ MORE: Sama Ram Mohan Reddy : కవిత లేఖ గురించి పది రోజుల ముందే చెప్పా.. కవిత చెప్పిన దెయ్యాలు వాళ్లే