అర్ధరాత్రి వైసీపీ మహిళా నేతల ఇంటి తలుపు తీసి నోటీసులు తీసుకుని వెళ్లమని చెబుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మీకు ఏం పోయేకాలం వచ్చిందని, అర్ధరాత్రి నిద్రలేపి నోటీసులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. నెల్లూరులో ఉన్న 40 శాతం ఓటర్లకు నోటీసులు ఇచ్చారని, ఇంట్లో వైఎస్ జగన్ ఫోటో ఉంటే చాలు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటీష్ వాళ్లకు, చంద్రబాబు నాయుడుకు తేడా ఉందా? అని.. మహాత్మా గాంధీని కూడా…