Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Perni Nani Praises On Cm Ys Jagan

Perni Nani: వైఎస్ జగన్ మాట ఇచ్చారు.. అది రద్దు చేశారు..

Published Date :June 9, 2023 , 3:45 pm
By Sudhakar Ravula
Perni Nani:  వైఎస్ జగన్ మాట ఇచ్చారు.. అది రద్దు చేశారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Perni Nani: ఉద్యోగుల పట్ల ఇలాంటి సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో లేదు అంటూ సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసలు కురిపించారు మాజీ మంత్రి పేర్నినాని.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారన్న ఆయన.. సీపీఎస్ విధానంలో ఉద్యోగికి రూ. 400 పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.. ఇప్పుడు సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని తెలిపారు. పే కమిషన్ వేసేందుకు గతంలో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేది.. కానీ, రోడ్డెక్కి ఉద్యమం చేయకుండా గతంలో ఏ ప్రభుత్వమూ పీఆర్సీ కమిటీ నియామకం చేయలేదని.. ఏ ఉద్యోగీ రోడ్డెక్కకుండానే 12వ పీఆర్సీని సీఎం జగన్ ప్రకటించారని గుర్తుచేశారు.

Read Also: WTC FINAL 2023: ఇది ఐపీఎల్ కాదు ఐసీసీ.. ఒక్క ఇన్సింగ్స్ తో క్రేజ్ ఢమాల్..?

కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు పేర్నినాని.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేస్తున్నారన్న ఆయన.. ఉద్యోగుల పట్ల ఇంతగా సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో ఏదీ లేదన్నారు.. రాజకీయం కోసం తెలంగాణలో ఎవరో సీఎం చేశారని ఇక్కడ చేయడం లేదని స్పష్టం చేశారు.. వైద్య విధాన పరిషత్ లో పనిచేసే ఉద్యోగులు గతంలో చాలా కష్టాలు పడేవారు.. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు పెన్షన్ రావాలంటేనే నరకం చూసేవారన్నారు.. రాష్ట్రంలో 13 వేల మంది వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపారని వెల్లడించారు..

Read Also: Sini Shetty: మిస్ వరల్డ్ 2023లో భారత తరుపున “సినీ శెట్టి” ప్రాతినిధ్యం.. అసలెవరీ సినీ షెట్టి..

ఇక, పాదయాత్ర చేస్తోన్న నారా లోకేష్ ప్రజా ప్రతినిధి కూడా కాదు.. చంద్రబాబు కుమారుడికి భద్రత కరవైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారని ఎద్దేవా చేశారు పేర్ని నాని.. నోటికొచ్చినట్లుగా భద్రతా సిబ్బందిని లోకేష్ మాట్లాడుతున్నారు.. మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి ఇవ్వాల్సినంత దానికంటే ఎక్కువగానే భద్రతను ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు.. టీడీపీ వాళ్లే సెల్ఫీ ఇవ్వలేదని లోకేష్‌ను కోడిగుడ్లతో కొట్టారన్న ఆయన.. చంద్రబాబు కుమారుడికి బ్లాక్ క్యాట్ కమాండోలు ఇవ్వాలని అంటున్నారా? అర్థం కావడం లేదు అంటూ ఎద్దేవా చేశారు.. మరోవైపు.. టీడీపీ అధ్యక్షుడిగా వర్ల రామయ్య ఎందుకు ఉండకూకూడదు..? అని ప్రశ్నించారు. ఉచిత సలహాలు ఇచ్చే విధానాన్ని వర్ల రామయ్య మానుకోవాలని హితవుపలికారు.. జనంలో క్రెడిబులిటీ సంపాదించేందుకు ఏం చేయాలో చంద్రబాబుకు వర్ల రామయ్య సలహాలివ్వాలని సూచించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • chandrababu
  • CM YS Jagan
  • Nara Lokesh
  • Perni Nani

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions