Perni Nani: ఉద్యోగులంతా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపే ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని.. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతుండగా.. ఆ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన పేర్ని నాని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మచిలీపట్నంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు.. 4,400 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నారని తెలిపారు.. అయితే, చంద్రబాబు పాలనలో ఉద్యోగస్తులు మానసిక వేధింపులకు గురిచేశారని విమర్శించారు.. కానీ, జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఉద్యోగులు ఎప్పుడూ అవమానపడలేదన్నారు.. ఉద్యోగులంతా జగన్ మోహన్ రెడ్డివైపే ఉన్నారన్న ఆయన.. చంద్రబాబు హామీలతో జీతాలు వస్తాయా? లేదా? అని ఉద్యోగస్తులు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతే.. చంద్రబాబు నాయుడు హామీలతో ఇంకేమవుతుందోనని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్నినాని. ప్రస్తుతం మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని.. ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉన్న విషయం విదితమే కాగా.. తన కుమారుడిని ఎన్నికల బరిలోకి దింపిన విషయం విదితమే.. ఒఇ, తన కుమారుడిని గెలిపించే బాధ్యతను భుజానికి ఎత్తుకున్న నాని.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
Read Also: Samantha : ఉర్ఫీ డ్రెస్ పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..