Perni Nani and Collector: మరోసారి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌గా మారింది పరిస్థితి.. జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. అయితే, కలెక్టర్ రాకపోవటంతో పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గతంలో కూడా కలెక్టర్ రాక పోవటంతో ధర్నా చేస్తామని అప్పట్లో పేర్ని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చగా మారాయి.. చివరకు పేర్ని వ్యాఖ్యలతో కలెక్టర్, పేర్ని నానిని సీఎంవోకి పిలిచి సర్దిచెప్పారు.. తాజాగా, మరోసారి కలెక్టర్ టార్గెట్ గా పేర్ని నాని వ్యాఖ్యలు చేశారు.
Read Also: IND vs NZ 1st Semi-Final: భారత్, న్యూజిలాండ్ తొలి సెమీస్‌కు ప్రత్యేక అతిథి.. అస్సలు ఊహించలేరు!
సర్వ సభ్య సమావేశం కన్నా వ్యవసాయ సలహా మండలి సమావేశం ఎక్కువయ్యిందా ? అంటూ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌పై మండిపడ్డారు పేర్నినాని.. ఓట్లు వేసిన ప్రజలకు జవాబుదారీగా ఉండలేని అధికారులు ఎందుకు ? అని నిలదీశారు.. వ్యవసాయ సలహా మండలి సమావేశం కంటే ముందే సర్వ సభ్య సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.. కానీ, జడ్పీ సమావేశానికి రాకూడదు అనే ఈ సమావేశం కలెక్టర్ ఏర్పాటు చేశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ సలహా మండలి సమావేశం పెట్టుకోమని సీఎంవో కార్యాలయం చెప్పింది అనడం విచిత్రంగా ఉందన్నారు. సర్వ సభ్య సమావేశానికి వెళ్లొద్దని సీఎంవో చెప్పిందా? అంత అర్జెంట్ అయితే నిన్న రాత్రే సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు కదా..? అంటూ తీవ్రస్థాయిలో ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.