మరోసారి కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి పేర్ని నాని వర్సెస్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్‌గా మారింది పరిస్థితి.. జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.. అయితే, కలెక్టర్ రాకపోవటంతో పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గతంలో కూడా కలెక్టర్ రాక పోవటంతో ధర్నా చేస్తామని అప్పట్లో పేర్ని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రచ్చగా మారాయి.