ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా.. అన్నాడో కవి.. మీ కష్టాల్ని తీర్చడానికి ఎవరూ రారు. మీరే ముందుకు రావాలి. యువత అయితే అడుగు అడుగు ముందుకేస్తే గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో సమస్యలు పారిపోతాయి. ప్రభుత్వమే వచ్చి అన్ని పనులు చేయాలంటే కుదరదు. ఈ స్ఫూర్తితోనే ముందుకు కదిలారు వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని పెర్కంపల్లి తండా యువత. యెన్కెపల్లి నుంచి పెర్కంపల్లి,పెర్కంపల్లి తాండా కు వెళ్లే ప్రధాన రోడ్డులో మూడు సంవత్సరాలుగా నిలిచిపోయాయి బ్రిడ్జి పనులు. దీంతో సమీప గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: Siricilla Police: పోలీసు అమరవీరుల త్యాగం అజరామరం
నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన వేసిన తాత్కాలిక రోడ్డు ఎప్పటికప్పుడు పాడయిపోతూనే వుంది. వర్షాకాలంలో భారీ వర్షాలు వచ్చాయంటే అంతే సంగతులు. వాగు ఉధృతికి కొట్టుకుపోతుంది ఈ తాత్కాలిక రోడ్డు. దీంతో గ్రామానికి, తండాకు రాకపోకలు బంద్ అవుతాయి. గ్రామస్తులు ఎన్నిసార్లు అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడు లేడు. దీంతో యువత ముందుకు కదిలింది. అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ముందుకొచ్చింది యువత. జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో సొంతంగా తాత్కాలిక రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టారు గ్రామ, తండా యువత. ఈ పనులతో తాత్కాలిక రోడ్డు బాగుపడింది. యువత చేసిన పనికి గ్రామస్తులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా ఇతర గ్రామాల యువత కూడా ముందుకు వస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటున్నారు.
Read Also: Minister KTR Live: ముదిరాజ్ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్