Assam Floods: అసోంను ముంచెత్తిన వరదలు.. 36కు చేరిన మృతులు
- అసోంను ముంచెత్తిన వరదలు
- 36కు చేరిన మృతులు
- బాధితుల్ని కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్న కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. గత కొద్ది రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లు దెబ్బ తిన్నాయి. ఇళ్లల్లోకి నీరు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు భారీ వరదల కారణంగా సుమారు 4 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Dry Coconut: ఎండు కొబ్బరి తినడం వల్ల ఆ ప్రమాదాల బారి నుంచి బయటపడొచ్చు..
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
కొపిలీ, బరాక్, కుషియారా వంటి నదులు ప్రమాదకర స్థాయి మించి ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు నివేదికలు తెలిపాయి. వరదల వల్ల 19 జిల్లాల్లో నివసిస్తున్న 4 లక్షల మంది పరిస్థితి దయనీయంగా మారినట్లు పేర్కొన్నాయి. ఈ విపత్తు ప్రభావం కరీంగంజ్ జిల్లాలో తీవ్రంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు.. అక్కడ 2.5 లక్షల మందిపై ప్రభావం పడినట్లు చెప్పారు. ఇప్పటివరకూ వరదల్లో, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 36కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Vegetables- Fruits Price: సామాన్యులను బెంబేలెత్తిస్తున్న పండ్లు, కూరగాయల ధరలు..
అసోం వరద బాధితులకు కాంగ్రెస్ అండగా నిలిచింది. వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖర్జున ఖర్గే, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. 15 జిల్లాల్లో లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని.. ఇప్పటి వరకు 36 మంది ప్రాణాలు కోల్పోయారని ఖర్గే పేర్కొన్నారు. అసోం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సంఘీభావంగా నిలుస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నామని ఖర్గే ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు. రాష్ట్రంలో వరద బాధిత ప్రజలకు సహాయ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని అసోం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కోరారు.
ఇది కూడా చదవండి: Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!