టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రోజు రోజుకు మరింత యంగ్ గా మారిపోతున్నారు.తాజాగా ఆయన ఫొట్ షూట్ చేశారు. ఈ షూట్ లో కొత్త లుక్ తో బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ తో చిరంజీవి వింటేజ్ రోజులను గుర్తుకు తెస్తున్నారు. కళ్లకు బ్లాక్ గ్లాసెస్ ధరించి సూట్, బూట్ వేసి అదరగొడుతున్నారు చిరు. హెయిర్ స్టయిల్ కూడా మార్చేశారు. ఇటీవల రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు లోను చిరు 30 ఏళ్ల కుర్రాడిలా దర్శనమిచ్చారు. క్యూట్ స్మైల్ తో స్వాగ్ చూపిస్తున్నారు చిరు. మొత్తానికి చిరు 70స్ లో కూడా 30 లా సరికొత్త మేకోవర్ లో ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇస్తున్నారు. క్లాస్ లుక్లో మెగా మేకోవర్ లో అదరగొట్టేసారు బాస్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక చిరు తన అభిమానులను అలరించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తీసుకువస్తున్నారు. మనశంకర వరప్రసాద్ వచ్చే సంక్రాంతికి వస్తుండగా విశ్వంభర సమ్మర్ లో సందడి చేయనుంది.