Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Pcc Chief Mahesh Kumar Goud Key Comments On Phone Tapping Case

Mahesh Kumar Goud: మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం

Published Date :June 17, 2025 , 2:01 pm
By Venkatesh
  • మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం
  • ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతల ఫోన్లో ట్యాప్ చేయడం హేయమైన చర్య
Mahesh Kumar Goud: మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు కాగా సిట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ట్యాప్ చేసిన నెంబర్లలో తన నెంబర్ ఉండడంతో కొంత సమాచారం కావాలని సిట్ కోరడంతో సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ కు తన స్టేట్ మెంట్ ను ఇచ్చాడు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో పాటు నా ఫోన్ కూడా ట్యాప్ చేసి మా మూమెంట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారన్నారు. ఇదే ఫిర్యాదును గతంలో చేశాను.. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయని తెలిపారు.

Also Read:Pooja Hegde : పాత పరిచయాలతో, మళ్లీ టై అప్ అవుతున్న పూజా హెగ్డే ?

చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లు టాప్ చేశారు.. ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతల ఫోన్లో ట్యాప్ చేయడం హేయమైన చర్య.. ఇలాంటి చర్యకు పాల్పడ్డ నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. మేము మాత్రమే శాశ్వతంగా అధికారంలో ఉండాలి అనే చెడు ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. 2018లో మేము ఓడిపోవడానికి కారణం కూడా మా నాయకుల ఫోన్స్ ట్యాప్ చేయడం వాళ్లే అని అర్థమైంది అని అన్నారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయన్నారు.

Also Read:Hyderabad: డిఫెన్స్ మద్యం పట్టివేత.. ఎక్స్ ఆర్మీ పర్సన్ అరెస్ట్!

సిట్ దర్యాప్తులో 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు జాబితాలో ఉన్నాయి.. అనిల్ కుమార్ యాదవ్, అనిల్ తోపాటు అనేకమంది ఫోన్లు టాప్ అయినట్లు బయటికి వస్తుంది.. నాడు ఏరకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి దుశ్చర్యకు పాల్పడ్డారో అర్థం అవుతుంది. ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా పనిచేయాల్సినటువంటి అధికారులు… ఏ రకంగా రాజకీయ నాయకుల కు తలొగ్గి అడుగులకు మడుగులు ఒత్తారో అర్థమవుతుందన్నారు. ప్రైవసీ అనేది మా ప్రాథమిక హక్కు.. దానిని కాలరాశారు.. రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టి దుశ్చర్యకు పాల్పడడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.

Also Read:Iran-Israel War: ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఖమేనీ అత్యంత సన్నిహితుడు మృతి

నా పూర్తి పేరు పెట్టకుండా నక్సలైట్లకు సింపతైజర్లుగా ఉన్నారని ట్యాప్ చేయడం సిగ్గుచేటు.. కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేయడం దుర్మార్గమైన చర్య.. ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేశారు దానికి మీరు శిక్షార్హులు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందేనని అన్నారు. ఇలాంటి దిగజారుడు పనికి ఒడిగట్టిన ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకు కూడా శిక్ష పడాలన్నారు.

Also Read:Bharat Petrol: ఎంతకు తెగించార్రా.. ఉప్పల్ లో భారత్ పెట్రోల్ పంపు ఘరానా మోసం.. మిషన్ లో సెట్టింగ్ పెట్టి..

సజావుగా విచారణ జరిపి… రాజకీయ నాయకులైన, అధికారులైన… కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.. దేశ చరిత్రలో ఇంతటి హేయమైన చర్యకు పాల్పడడం ఇదే ప్రథమం.. కెసిఆర్ కేటీఆర్ లు రాజకీయ అవసరాల కోసం రాజకీయ నాయకులు, వ్యక్తులు, విలేకరులు, అధికారులు, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం హేయమైన చర్య.. టిడిపి బిజెపి నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు.. మా పార్టీని నాశనం చేసేందుకు నా కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

Puri Jagannadh : తమిళ ‘బెగ్గర్’తో మలయాళ కుట్టి రొమాన్స్

నా పేరు కూడా పూర్తిగా మెన్షన్ చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందని పోలీసులు చెప్పారు.. మావోయిస్టులకు సహకరిస్తున్నారని ఉద్దేశంతో ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు చెప్పాడట.. ప్రభాకర్ రావు నాటి సిఎస్ ఇద్దరు కలిసి ఎన్నికల ముందు రెండు సంవత్సరాలు ఫోన్ ట్యాప్ చేశారు. ఆ హార్డ్ డిస్క్‌లను కూడా ధ్వంసం చేశారు.. ఆనాడు ఆకస్మాత్తుగా మా కార్లు ఆపేవారు.. ఆపి తనిఖీలు చేసేవారు.. అనుక్షణం పోలీసులు మమ్మల్ని నీడలా వెంటాడేవారు.. అకారణంగా అనేకసార్లు గృహనిర్బంధాలు చేశారు అని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • kcr
  • ktr
  • PCC Chief Mahesh Kumar Goud
  • phone tapping case

తాజావార్తలు

  • Modi-Trump: ట్రంప్‌కు మోడీ ఎందుకు గుర్తుకొచ్చినట్లు.? వెనక పాకిస్తాన్ కోణం..

  • Health Tips: రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా.. డాక్టర్స్ చెప్పేది ఏంటంటే..

  • UDAN Scheme 2.0: దేశంలో కొత్తగా 100 ఎయిర్‌పోర్టులు, 200 హెలిప్యాడ్స్..

  • Dhurandhar 2: ధురంధర్-2 క్లైమాక్స్‌ సాంగ్ వైరల్.. అసలెవరు ఈ “రాస్‌పుటిన్”, ఐఎస్ఐ అధికారి పాత్రతో సంబంధం ఏమిటి..?

  • US – Cuba War: ట్రంప్ ‘వార్’ వార్నింగ్.. క్యూబాపై యుద్ధ మేఘాలు! అమెరికా తదుపరి టార్గెట్ ఇదేనా?

ట్రెండింగ్‌

  • 2K డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, ఫ్లాగ్‌షిప్ పనితీరుతో రాబోతున్న iQOO Neo 11 Pro సిరీస్..!

  • SGS మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ + పవర్‌ఫుల్ బ్యాటరీ + AI ఫీచర్లతో Vivo Y11 5G & Y21 5G స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. ధర కూడా తక్కువే..!

  • Shane Warne-RR: షేన్‌ వార్న్‌ మాస్టర్ మైండ్.. రాజస్థాన్‌ రాయల్స్‌ నుంచి రూ.460 కోట్లు!

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions