మీరు సీఎం..సీఎం అంటే నాకు భయం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మాన్ని రక్షించాలని కోరుకుంటే ఏదైనా జరుగుతుందన్నారు. ప్రపంచం గుర్తించేలా పిఠాపురం నుంచి మార్పు ప్రారంభించాలని సంకల్పిస్తున్నామని చెప్పారు. మీ గొంతే నా గొంతు మీ కలే నా కల అన్నారు. గత పది సంవత్సరాలుగా పార్టీ పెట్టి ఎన్నో వ్యయప్రయాసలు పడ్డానని గుర్తుచేశారు. పదవులు వచ్చినంత మాత్రనా తల ఎగుర వేయకూడదని పేర్కొన్నారు. వ్యక్తిగత ద్యేషాలకు విధ్వాంశాలకు పాల్పడవద్దని కార్యకర్తలకు నాయకులకు సూచించారు.
READ MORE: IND vs SA Test : భారీ విజయంతో సౌతాఫ్రికాను చిత్తుచేసిన టీమిండియా..
ప్రతిపక్షం లేదని అనుకోవద్దు సమస్య వచ్చినప్పుడు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీశాఖలో 425 పోస్టులు ఖాళీగా ఉన్నాయని..ఫారెస్ట్ చెక్ పోస్టుల్లో నిఘా కొరవడిందన్నారు. ఆంధ్రా నుంచి అక్రమంగా రవాణా చేసిన ఎర్రచందనం దుంగలను నేపాల్ లో పట్టుకున్నారని తెలిపారు. ఈ ఫైల్ తన దగ్గరకు వచ్చినట్లు వెల్లడించారు. ఆ ఎర్రచందనాన్ని ఏలాగ వెనక్కి తీసుకుని రావాలా అని ఆలోచన చేస్తున్నానన్నారు. బియ్యం అక్రమ రవాణాను అడ్ఢుకోమని మంత్రి మనోహర్ కు చెప్పినట్లు తెలిపారు. వేల టన్నుల బియ్యం సీజ్ చేశామన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారో త్వరలోనే పట్టుకుంటామని హెచ్చరించారు.