టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీకావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ సమావేశమయ్యారు.
ఆంధ్ర ప్రదేశ్ లో రిజర్వేషన్ సౌకర్యం, ముద్రగడ పద్మనాభంపై గౌరవంతో కాపు సామాజిక వర్గం బలపరచడం వల్లే వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంది అని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీలో టీడీపీ- జనసేన మధ్య ఉన్న బంధాన్ని బలహీన పరచడానికి వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు
పొలిటికల్ కరప్షన్ లేని జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని 2024లో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో వచ్చేది జనసేన- టీడీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కనుక మేం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ సభలో ఈ సమస్యపై మాట్లాడుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
2024లో వచ్చేది జనసేన - టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి ఉన్న నేతను ఎలా అడ్డుకోవాలో తనకు తెలుసన్నారు. తమకు నైతికంగా బలం ఉంది కాబట్టే.. నేనింత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే వాడిని అయ్యామన్నారు. తాను ప్యాకేజ్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారని.. తనకు డబ్బంటే ప్రేమ లేదని వాళ్లకెలా చెప్పనంటూ పేర్కొన్నారు.