కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున అక్కినేని, క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ “DNS”.రీసెంట్ గా ఈ మూవీ ఎంతో గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ కూడా మూవీ అనౌన్స్మెంట్ కు ఒక రోజు ముందే స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై డీఎన్ఎస్ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావులు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అలాగే సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా డీఎన్ఎస్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
“డీఎన్ఎస్ కుటుంబానికి అడిషనల్‌గా మరో పవర్ హౌజ్ యాడ్ అయింది. మేము రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ను ఆహ్వానిస్తున్నందుకు చాలా ఎగ్జయిటింగ్‌గా సంతోషంగా ఉంది. మీ మదిని దోచుకునే అద్భుతమైన పాటల కోసం రెడీగా ఉండండి” అని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP నిర్మాణ సంస్థ అధికారిక ట్విటర్ పేజీ నుంచి పోస్ట్ విడుదల చేశారు. అయితే సౌత్ హీరో స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా అనగానే సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ అయింది. దానికి తోడు ఈ సినిమాకు రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తుండడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.అంతేకాకుండా ఇందులో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా నటిస్తోందని తెలిసాక ఫ్యాన్స్ లో సినిమాపై మరింత హైప్ ఏర్పడింది.. ఇదిలా ఉంటే దేవి శ్రీ ప్రసాద్ రీసెంట్ గా పుష్ప చిత్రానికి గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. దేవిశ్రీకి సంగీత దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందాయి. వాటిలో నేషనల్ అవార్డ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలిచిపోయింది.
A powerhouse addition to the #DNS family! 🔥
We're thrilled to welcome rockstar @ThisIsDSP on board 🎶 🥁
Get ready for some electrifying music charts that are going to blow you all away! 🥳❤️🔥@dhanushkraja @iamnagarjuna @iamRashmika @sekharkammula @AsianSuniel pic.twitter.com/MaakCc5lie
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) January 20, 2024