Pawan Kalyan: టీడీపీ వెనుక జనసేన వెళ్లటం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: గత ఎన్నికలలో గెలుస్తామో లేదో తెలియదు కానీ బరిలో నిలబడాలి అని నిర్ణయించి పోటీకి దిగానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సారి పరిస్థితి అలా ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ మహాత్ముడు అయితే మనం ఒంటరిగా పోటీ చేయవచ్చని.. కానీ జగన్ ప్రజా కంటకుడు అని విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ నుంచి కొందరు వైసీపీకి వెళ్లి నన్ను విమర్శిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో సర్కారును స్థాపించడం పక్కా అని అన్నారు. దశాబ్దం ఆగి తెలంగాణలో పోటీ చేశానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ వెనుక జనసేన వెళ్లటం లేదన్న పవన్.. టీడీపీతో కలిసి జన సేన నడుస్తోందన్నారు. వైసీపీని తక్కువ చేయనని.. జగన్ విధానం వల్ల ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
Read Also: Pawan Kalyan: ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తుపై పవన్ క్లారిటీ
Also Read
ఎన్నికలకు 100 రోజుల సమయం ముందు అయోమయం వద్దన్నారు. నన్ను సంపూర్ణంగా నమ్మండి అప్పుడు ఏ గొడవలు జరగవని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నన్ను మోడీ , అమిత్ షా, చంద్రబాబు అర్థం చేసుకున్నారని.. కానీ నా దగ్గర ఉన్న కొందరు మాత్రం అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఆలోచన చేసే వారు వైసీపీలోకి వెళ్లి పోవచ్చన్నారు. టీడీపీ జనసేన పొత్తుపై విమర్శలు చేసే వారని వైసీపీ కోవర్టులుగా పరిగణిస్తామన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఆయన తెలిపారు. జరగబోయేది కురుక్షేత్రం అంటున్న జగన్‌కి ఎవరు అర్జునుడు, ఎవరు కృష్ణుడో త్వరలో తెలుస్తుందన్నారు.
కేంద్రం, బీజేపీ, మోడీ జనసేనకు అండగా ఉంటారని పవన్ తెలిపారు. ఈ నెల 9, 10 తేదీల నుంచి నియోజక వర్గ ఇంఛార్జిలు కీలక నేతలతో ఇంటరాక్షన్ అవుతానన్న పవన్.. జగన్ పదేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండేలా పనిచేయాలన్నారు. ప్రతి రోజు హాఫ్ పర్సెంట్ వైసీపీ ఓటింగ్ తగ్గేలా పని చేయాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
తాజావార్తలు
-
Story Board : బ్యాంక్ అకౌంట్ ఉంటే బాదుడు తప్పదా..?
-
Ponguleti Srinivas Reddy: ధరణి అక్రమాలు, భూ సమస్యలపై సెట్ విచారణ
-
Selling Racket: తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందుకు ధర..
-
Operation Muskaan : ‘ఆపరేషన్ ముస్కాన్’ సక్సెస్.. 6,307 మంది చిన్నారులకు కొత్త జీవితం.!
-
Ayodhya: అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రం కలకలం.. విద్యార్థి అరెస్ట్!
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!