Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనలు సృష్టించే రాజకీయాలకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రాష్ట్రం పట్ల ఒకే భావన పెరగాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. తెలంగాణ ప్రజలకు తమ రాష్ట్రంపై ఉన్న భావోద్వేగ అనుబంధం కనిపిస్తోందని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్రం కంటే కులాలపై ఎక్కువ అభిమానం కనిపించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. రాష్ట్రం అనే భావన బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలకు పైగా భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేసిన పవన్, వారి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. రైతుల సహకారం, నమ్మకంతో ప్రారంభమైన అమరావతి ప్రాజెక్టును రాజకీయ వివాదాల కేంద్రంగా మార్చడం సరికాదన్నారు. ‘జై ఆంధ్రా’ అనే నినాదం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, మొత్తం రాష్ట్రాన్ని ఒకే తాటిపైకి తీసుకువచ్చే భావనగా చూడాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి తమ రాజధాని అనే భావన కలగాలని చెప్పారు. ప్రజలను కలపడానికి వచ్చామని, విడదీయడానికి రాలేదని స్పష్టం చేశారు.
Also Read
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
అమరావతి విషయంలో అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని విధానపరంగా చర్చించాలని పవన్ సూచించారు. రాజధాని నమూనా, అభివృద్ధి ప్రణాళికలు, మూడు రాజధానుల ప్రతిపాదన వంటి అంశాలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చని, కానీ బెదిరింపులు, హింసాత్మక వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేసిన పవన్, రౌడీయిజం, గూండాయిజం వంటి ధోరణులతో ఎవరినీ భయపెట్టలేరని అన్నారు. చంపేస్తాం, నరికేస్తాం వంటి వ్యాఖ్యలతో ప్రజలను భయపెట్టే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అంశాన్ని చర్చల ద్వారానే పరిష్కరించాలన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అమరావతిపై వివిధ ప్రతిపాదనలు వచ్చాయని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి రాజధానిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు కూడా వినిపించాయని గుర్తుచేశారు. అయితే వాటి వెనుక ఉన్న ఉద్దేశాలపై అప్పట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని పేర్కొన్నారు. 33 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి గతంలోనే విస్తృత అంగీకారం లభించిందని, అందువల్ల ఇప్పుడు అందరూ కలిసి అమరావతి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్‌హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!