CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటన, ఆయన సభలపై అక్కడి రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ సభలను అడ్డుకోవడం సరికాదని, రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. తాను ఇటీవల తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చానని గుర్తు చేశారు. అక్కడ కర్ణాటకతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని చెప్పారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ప్రచారానికి వచ్చారని ఉదాహరణగా పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా ఉందని, గతంలో బీఆర్ఎస్ తమను జాతీయ పార్టీగా ప్రకటించుకుని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ యూనిట్‌ను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు చంద్రబాబు… రాష్ట్ర సరిహద్దులు దాటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం సాధారణ విషయమేనని, అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తనకు అర్థం కావడం లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు వివిధ దేశాల్లో కీలక పదవులు చేపడుతున్నారని చంద్రబాబు చెప్పారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో తెలుగువారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారని, అక్కడి చట్టాలు, రాజ్యాంగాల ప్రకారం సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించే వారే నాయకులుగా ఎదుగుతారని చెప్పారు.
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
తెలంగాణలో పవన్ కల్యాణ్‌పై కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మంచి రాజకీయ సంస్కృతికి నిదర్శనం కాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు ప్రజా చైతన్యం, ప్రజాసేవ విషయంలో పోటీ పడాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా వారి మద్దతు పొందాలని సూచించారు. అనవసర వ్యాఖ్యలతో కొత్త సమస్యలను సృష్టించడం మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయిందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి పథంలో సాగుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఎవరు ఏ ప్రాంతానికి ఎంత సేవ చేశారో ప్రజలకు బాగా తెలుసని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలోని కొందరు నాయకులు అనవసర అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ వివాదాలకు తెరలేపడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav vs Ishan: క్రెడిట్ అంతా తీసుకున్నావ్.. వైభవ్ భవిష్యత్ కెప్టెన్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
-
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
-
CSK New Coach: సీఎస్కే కొత్త కోచ్.. ఎంఎస్ ధోనీ రెండు కీలక షరతులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!