Indigo Flight: పట్నా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో విమానాన్ని లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మృతుడిని అస్సాం రాష్ట్రంలోని నల్బారి ప్రాంతానికి చెందిన సతీష్ బర్మన్ గా గుర్తించారు. ఆయను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలో చికిత్స పొందేందుకు తన భార్య కంచన్, మేనల్లుడు కేశవ్ కుమార్‌తో కలిసి ప్రయాణిస్తున్నారు.
Read Also: Ambati Rambabu: చంద్రబాబుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..
సతీష్ బర్మన్, భార్య, మేనల్లుడు కలిసి శనివారం ఉదయం 10 గంటలకు ఇండిగో 6E 2163 ఫ్లైట్‌లో పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరారు. అయితే, విమానం గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రయాణీకులు, విమాన సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మృత్యువుతో పోరాడుతూ ఉన్న ఆయన లక్నో సమీపానికి వచ్చేసరికి మృతి చెందారు. సిబ్బంది వెంటనే పైలట్‌కు ఈ విషయాన్ని తెలపగా.. వెంటనే పైలట్ లక్నోలోని చౌధరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసర ల్యాండింగ్ అనుమతి కోరారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి ఇచ్చిన తర్వాత విమానం లక్నో ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. అక్కడ వైద్యులు ప్రయాణికుడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
Read Also: Ambati Rambabu: చంద్రబాబుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..
సమాచారం అందుకున్న సరోజినీ నగర్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేజీఎంయూ (కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ) కి పోస్టుమార్టం కోసం తరలించారు.