Paris Olympics 2024: మనకు ఒలింపిక్స్ అనగానే ముందుగా 5 రింగ్స్ సింబల్ గుర్తొస్తుంది. 2024 ఒలింపిక్ క్రీడలు జూలై 26 నుండి మొదలై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. సుమారు 10 వేల మంది అథ్లెట్లు ఇందులో పాల్గొనబోతున్నారు. ఇకపోతే ఒలంపిక్స్ చరిత్రను పరిశీలిస్తే 1896లో ఈ విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి. చాలాకాలంగా ఈ ఆటలకు ప్రతీక అయిన 5 వృత్తాకార వలయాలను మనం చూస్తున్నాము. ఈ ఆటలు ప్రారంభమై ఒక శతాబ్దానికి పైగా గడిచింది. అయితే కేవలం 5 రింగ్ లు ఎందుకు.? వాటి అర్థం ఏమిటి అనేది ఇప్పటికి చాలామందికి ఓ పెద్ద ప్రశ్న.
Jio Plans: జియో 3 కొత్త చౌకైన ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, డేటాతో పాటు ఓటీటీలు కూడా..
ఎడమ నుండి కుడికి క్రమంలో ఈ 5 రింగుల రంగులు నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపుగా ఉంటాయి. ఈ 5 రింగులను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (IOC) మాజీ అధ్యక్షుడు పియరీ డు కూబెర్టిన్ రూపొందించారు. ఈ 5 రింగ్స్ సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒలింపిక్ ఉద్యమానికి ప్రతీక. ఒలింపిక్ రింగులు ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలకు ప్రతీక. ఆఫ్రికా, ఉత్తర & దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా ఖండం చుట్టూ ఉన్న అన్ని దేశాలు ఒకే ఖండంగా లెక్కించబడ్డాయి.
Paris Olympics 2024: ప్రీ-క్వార్టర్స్‌లోకి భజన్ కౌర్.. క్వార్టర్-ఫైనల్‌కు సాత్విక్-చిరాగ్
ఒలింపిక్స్ కు చిహ్నాలుగా ఉపయోగించే ఈ 5 రింగులకు వేర్వేరు రంగులు కూడా వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. ఈ ఐదు ఒలింపిక్ రింగులను పియరీ డి కూబెర్టిన్ తయారు చేశారు. పియరీ డి కూబెర్టిన్‌ను ఒలింపిక్ క్రీడల సహ వ్యవస్థాపకుడిగా కూడా పిలుస్తారు. ఈ ఐదు రింగులను 1912 సంవత్సరంలో రూపొందించబడ్డాయి. ఇవి 1913 సంవత్సరంలో బహిరంగంగా ఆమోదించబడినప్పటికీ., వీటిలో బ్లూ కలర్ రింగ్ ఐరోపాకు, పసుపు రంగు ఆసియాకు, నలుపు రంగు ఆఫ్రికాకు, ఆకుపచ్చ రంగు ఆస్ట్రేలియా, ఎరుపు రంగు అమెరికాకు చిహ్నం.