Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలోని గణేష్ నిమజ్జన ఊరేగింపులో తీవ్ర కలకలం రేగింది. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఒక పోలీస్ కానిస్టేబుల్‌పై తరుణ్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. పరిగిలోని అయోధ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న తరుణ్ అనే యువకుడిని “తమ గణేష్ విగ్రహం దగ్గరకు రావద్దు” అని నిర్వాహకులు హెచ్చరించి అక్కడి నుంచి పంపించివేశారు.
తననే రావద్దంటారా అని తీవ్ర ఆగ్రహానికి గురైన తరుణ్, మద్యం మత్తులో విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ తాళం చెవిని లాక్కున్నాడు. దీంతో ట్రాక్టర్ తాళం లాక్కోవడంపై గణేష్ ఉత్సవ నిర్వాహక యువకులకు, తరుణ్‌కు మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఈ గొడవలో తరుణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో యువకులపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. అది గమనించి గొడవను సర్దుమణిగించేందుకు అడ్డువెళ్లిన కానిస్టేబుల్ నరసింహులుపై కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్‌కు ఎడమ వైపు కడుపు భాగంలో తీవ్ర గాయమైంది. వెంటనే పోలీసులు గొడవ పడుతున్న యువకులను చెదరగొట్టి, కత్తి గాయమైన కానిస్టేబుల్ నరసింహులును పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పరిగిలోని వివేకానంద విగ్రహం వద్ద చోటుచేసుకుంది. దాడికి పాల్పడ్డ నిందితుడు తరుణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Also Read
- Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
- Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
- Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
తాజావార్తలు
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
-
Shabari Floods: ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన శబరి.!
-
Ganesh Immersion: హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. ట్యాంక్‌బండ్ వైపు పోటెత్తిన గణనాథులు
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!