Pakistan: ప్రపంచ రాజకీయాలు తరచుగా ద్వంద్వ ప్రమాణాలను ప్రదర్శిస్తాయి. దీనికి అతిపెద్ద ఉదాహరణ పాకిస్థాన్. ఒకప్పుడు ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే దేశంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో అపఖ్యాతి పాలైన పాకిస్థాన్, ఇప్పుడు SCO-RATS (ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక నిర్మాణం) కు ఛైర్మన్‌గా మారింది. ఉగ్రవాదంపై పోరాడటానికి సృష్టించిన సంస్థకు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఛైర్మన్‌గా మారింది. ఇది దొంగ చేతికి తాళాలు అనే సామేతను గుర్తు చేస్తుంది. ప్రస్తుతం పాకిస్థాన్ కొత్త నటకానికి తెరలేపింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దేశం నేడు తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటోంది. ప్రపంచం దేశాల నుంచి సానుభూతిని పొందాలని ప్రయత్నిస్తోంది.
READ MORE: World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే!
ఇటీవలి సంవత్సరాలలో పాకిస్థాన్ తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చిత్రీకరించుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం పాకిస్థాన్ తాలిబన్ (TTP) ఆ దేశంలో దాడులను పెంచుతున్నారు. దీంతో తాము ఉగ్రవాదంలో చిక్కుకున్నామని పాక్ నమ్మించే ప్రయత్నం చేస్తోంది. పాకిస్థాన్ కపటత్వంపై అమెరికా మాజీ రాయబారి రిచర్డ్ హోల్‌బ్రూక్ చెప్పిన ఓ వ్యాక్యం ఇప్పుడు గుర్తుకు వస్తోంది. “పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశంగా నటిస్తోంది. కానీ ఉగ్రవాదానికి స్పాన్సర్ పాకిస్థాన్ ఏ. పాక్ కుందేళ్ళతో పరిగెడుతుంది. వేటగాళ్ళతో కలిసి వేటాడుతుంది.” అని మాజీ అమెరికా రాయబారి స్పష్టం చేశారు. అంటే, పాకిస్థాన్ దృష్టిలో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే ఉగ్రవాదులు మంచివాళ్లు. పాకిస్థాన్‌పై దాడి చేసేవారు చెడ్డ ఉగ్రవాదలు అని చెబుతోంది.
READ MORE: Pawan Kalyan : ఇండస్ట్రీ హిట్ మూవీని మిస్ చేసుకున్న పవన్ కల్యాణ్..
పాకిస్థాన్ తనను తాను ఉగ్ర బాధిత దేశంగా ఎంత చిత్రీకరించుకున్నా.. అది పెంచి పోషించిన ఉగ్రవాద నెట్‌వర్క్‌లు భారతదేశంపై నిరంతరం దాడి చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. గతంలో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నవారు. ఇతర దేశాలను మాత్రమే కాకుండా తమను తాము కూడా ప్రమాదంలో పడేసుకుంటున్నారు. ఉగ్రవాదం మొత్తం మానవాళికి ముప్పు అని పేర్కొన్నారు. మోడీ మాటనే నిజాలుగా మారతాయా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనప్పటికీ.. పాకిస్థాన్ మాత్రం ఉగ్ర బాధిత దేశం అని ప్రకటించుకోవడం హాస్యస్పదం. ఇదో బూటకం.