Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఏ స్థాయి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కెరీర్ లో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండానే భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అలాంటి పవన్ కల్యాణ్ కూడా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. అప్పట్లో పవన్ హీరోగా ఎదుగుతున్న టైమ్ లో ఓ అదిరిపోయే కథ ఆయన వద్దకు వచ్చింది. కానీ ఆయన అనుకోని కారణాలతో ఆ సినిమాను క్యాన్సిల్ చేసుకుంటే మరో హీరో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏదో కాదు నువ్వే కావాలి. తరుణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాతోనే తరుణ్ స్టార్ హీరోగా అవతరించాడు.
Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా చేసి ఉంటే మరోలా ఉండేదేమో..
డైరెక్టర్ కె విజయ్ భాస్కర్ ముందుగా పవన్ కల్యాణ్, అమీషా పటేల్ జంటగా నువ్వే కావాలి కథతో షూటింగ్ మొదలు పెట్టారు. కానీ అనుకోని కారణాలతో ఆ మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత అదే కథతో తరుణ్ హీరోగా చేశాడు. రిలీజ్ అయ్యాక యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోకుండా ప్రేమికులుగా మారడం.. ఇంట్లో వాళ్ల కోసం ప్రేమను త్యాగం చేయాలని అనుకోవడం లాంటివి ఇందులో కట్టి పడేశాయి. మ్యూజిక్ అయితే ఇప్పటికీ యూట్యూబ్ లో మార్మోగిపోతూనే ఉంటుంది. అంత మంచి సినిమాను పవన్ కల్యాణ్ వదులుకున్నారు. ఒకవేళ ఆయన గనక ఈ సినిమా చేసి ఉంటే రికార్డులు బద్దలైపోయేవేమో. కలెక్షన్లు ఊహకు కూడా అందేవి కావేమో.
Read Also : Allu Arjun : బన్నీ చేసిన పని.. విజయ్ కు కెరీర్ ను మార్చేసిందంట..