Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- అమెరికా వద్ద 10 బిలియన్ డాలర్ల సాయం కోరిన పాకిస్థాన్.
- IMF ప్యాకేజీ కొనసాగుతున్నా ఆర్థిక ఒత్తిడి తగ్గలేదు.
- విదేశీ మారక నిల్వలు పెంచేందుకు ప్రత్యేక ఫెసిలిటీ ప్రతిపాదన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న పాకిస్తాన్, అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్లు ఆర్థిక సహాయాన్ని కోరినట్లు వార్తాసంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌కు పంపిన ప్రతిపాదనలో ఐదేళ్ల కాలపరిమితితో ‘బైలేటరల్ ఎక్స్చేంజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఫెసిలిటీ’ కింద 10 బిలియన్ డాలర్ల సహాయాన్ని కోరినట్లు నివేదిక పేర్కొంది. ఇప్పటికే పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్ల రుణం కోరింది. ఐఎంఎఫ్ షరతుల ప్రకారం పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ, నిర్మాణాత్మక సంస్కరణల్ని చేపట్టింది. అయినప్పటికీ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి కొనసాగుతోంది.
అమెరికా సాయం అందిస్తే పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు పెరగడంతో పాటు పాక్ కరెన్సీపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఐఎంఎఫ్ వంటి ఆర్థిక సంస్థలపై ఆధారపడటం కొంత వరకు తగ్గుతుందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇటీవల పాక్ అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వాన్ని నిర్వహించింది. దీంతో తమ దౌత్యపరంగా తమ ప్రాధాన్యత పెరిగిందని భావిస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా నుంచి సాయాన్ని ఆశిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి మహ్మద్ ఔరంగజేబ్ ఇటీవళ అమెరికా ట్రెజరీ సెక్రటరీతో సమావేశమై ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల వల్ల పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ప్రస్తావించినట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పాక్ తన ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ నిధులు, చైనా, సౌదీ అరేబియా వంటి దేశాల ఆర్థిక సహాయంపై, రుణాలపై ఆధారపడుతోంది.
Also Read
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
- Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!